YSR Kapu Nestham: రూ.15 వేలు నేరుగా అకౌంట్లోకి, వైయస్సార్ కాపు నేస్తం పథకాన్ని లాంచ్ చేయనున్న ఏపీ సీఎం, 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు రూ.354 కోట్లు జమ

హామీల్లో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ (YSR Kapu Nestham) అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan Mohan Reddy) రంగం సిద్ధం చేశారు.

AP CM YS Jagan Mohan Reddy government offers zero interest loans (photo-Twitter)

Amaravati, June 24: పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (AP CM YS jagan) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చుకుంటున్నారు. హామీల్లో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువనున్న అర్హులైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ (YSR Kapu Nestham) అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan Mohan Reddy) రంగం సిద్ధం చేశారు. ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు! జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించిన ఏపీ సీఎం, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన

కాగా నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని సీఎం జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం (CM Camp Office) నుంచి అమలు చేయనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా అర్హులైన కాపు మహిళలు 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు జమ చేయనున్నారు. మీటింగ్ మతలబు అదేనా?, బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోటల్లో రహస్య భేటీ, సుప్రీంకోర్టులో విచారణలో నిమ్మగడ్డ తొలగింపు అంశం

అయితే ఏడాదికి రూ.15వేలు ఇవ్వడం ద్వారా పేద కాపు వర్గం మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి వీలవుతుందని జగన్ నిర్ణయించారు. కాగా దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారిని ఈ పథకానికి అర్హులుగా భావించారు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబానికి 3 ఎకరాలలోపు మాగాణి లేదా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉండొచ్చు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది.

పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు.. లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదని కండీషన్ పెట్టింది. అలాగే ఆ కుటుంబంలో ఏ వ్యక్తీ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదనీ… ప్రభుత్వ పెన్షన్‌ పొందుతూ ఉండకూడదనే కండీషన్ కూడా పెట్టింది. అంతేకాదు ఆ ఫ్యామిలీకి కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్లు ఉండొచ్చు. కుటుంబంలో ఎవరూ ఇన్‌కంటాక్స్ చెల్లింపుదారుడై ఉండకూడదు.

దాదాపు ఆరు నెలల నుంచి ఈ పథకానికి మహిళలు అప్లై చేసుకున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ అర్హుల ఎంపిక ప్రక్రియ నడిచింది. ఇప్పుడు అన్ని లెక్కలూ తేల్చి… పథకాన్ని అత్యంత పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. జగన్ ఈ స్కీమ్ ప్రారంభించగానే… లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి మొదటి ఏడాదికి సంబంధించి… రూ.15వేలు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: శైవ క్షేత్రాలకు తెలంగాణ ప్రసిద్ధి..కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి త్రిలింగ క్షేత్రమే ఈనాటి తెలంగాణ..మహాకాళేశ్వరునికి కోటి పుష్పార్చనలో పాల్గొన్న సీఎం

Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు

CM Chandrababu Speech in Assembly: 2047 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ, అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఏమన్నారంటే..