AP 10th Class Betterment Exams: పదవ తరగతి విద్యార్థులకు తీపి కబురు, బెటర్‌మెంట్ ద్వారా మార్కులను పెంచుకునే అవకాశాన్ని కల్పించిన ఏపీ ప్రభుత్వం
రెండేళ్ల కోవిడ్ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల (AP 10th Class Exams) సౌలభ్య కోసం బెటర్‌మెంట్ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది
Amaravati, June 16: పదవ తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తొలిసారి టెన్త్ విద్యార్థులకు బెటర్‌మెంట్ (AP 10th class betterment exams) అవకాశమిచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఇప్పటివరకూ ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే బెటర్‌మెంట్ అవకాశం ఉంది.
కాగా, రెండేళ్ల కోవిడ్ పరిస్థితులతో ఉత్తీర్ణతాశాతం తగ్గిన నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల (AP 10th Class Exams) సౌలభ్య కోసం బెటర్‌మెంట్ అవకాశమిస్తూ నిర్ణయం తీసుకుంది. 50 మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏదైనా రెండు సబ్జెక్ట్‌లకు సప్లిమెంటరీలో బెటర్‌మెంట్ రాసే అవకాశమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకుగాను సబ్జెక్ట్‌కు 500 రూపాయల చొప్పున రెండు సబ్జెక్ట్‌లకు 1000 రూపాయిల ఫీజుగా నిర్ణయించింది. టెన్త్ ఫెయిల్ అయిన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గుడ్ న్యూస్, రోజుకు 2 సబ్జెక్టుల్లో కోచింగ్, 13 నుంచి పరీక్షలు ముగిసేవరకు స్కూళ్లలో వారికి ప్రత్యేక బోధన
ఇక రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు (AP SSC Result 2022) సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.