AP Budget Session 2022: ఈ రోజు కూడా 11 మంది టీడీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ వేటు, అసెంబ్లీలో ఫోన్‌లో రికార్డింగ్‌లు చేయకూడదని తెలిపిన స్పీకర్, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో తాగునీటి సరాఫరా ప్రాజెక్ట్

ఈ రోజు కూడా టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న కొన‌సాగించారు. అసెంబ్లీలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. సభా సంప్రదాయాలను పాటించాలని, చ‌ర్చ‌ల‌కు సహకరించి హుందాగా మెలగాలని అన్నారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై రూలింగ్‌ ఇచ్చారు. ఫోన్‌లో రికార్డింగ్‌లు చేయకూడదని తెలిపారు.

andhra-pradesh-speaker-tammineni-sitaram-fires-tdp-members (Photo-Flie Image)

Amaravati, Mar 17: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఈ రోజు కూడా టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న కొన‌సాగించారు. అసెంబ్లీలో సభ్యుల మొబైళ్లకు అనుమతి లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. సభా సంప్రదాయాలను పాటించాలని, చ‌ర్చ‌ల‌కు సహకరించి హుందాగా మెలగాలని అన్నారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై రూలింగ్‌ ఇచ్చారు. ఫోన్‌లో రికార్డింగ్‌లు చేయకూడదని తెలిపారు. శాసన సభలో (AP Budget Session 2022) టీడీపీ నేత‌లు ఆందోళ‌న కొన‌సాగించ‌డంతో 11 మంది టీడీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వారిలో సత్యప్రసాద్‌, చినరాజప్ప, రామ్మోహన్‌, అశోక్‌, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ ఉన్నారు.

అంత‌కు ముందు స‌భ‌లో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ... గిరిజనుల కోసం త‌మ ప్ర‌భుత్వం 31 పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఒడి పథకం కింద 2,86,379 మందికి గిరిజన మహిళలకు రూ.843,80 కోట్లు ఇస్తున్న‌ట్లు తెలిపారు. అమ్మ ఒడి పథకం కింద 2,86,379 మందికి గిరిజన మహిళలకు 843,80 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 2019-20 నుంచి 2021-22 దాకా 84,478 మంది గిరిజన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా 178. 67 కోట్ల రూపాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, ఏడో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పలు శాఖల బడ్జెట్‌ డిమాండ్లపై కొనసాగుతున్న చర్చలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్లో రూ.1,650 కోట్లతో (YS Jagan govt approved Rs. 1650 crore) తాగునీటి సరాఫరా ప్రాజెక్టును చేప‌ట్టనున్న‌ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు 2024 నాటికి పూర్తవుతుందన్నారు. ఈ వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు (drinking water supply project) కింద 32 మండలాల్లోని 29 లక్షల 23 వేల మందికి మంచినీరు త్రాగునీరు అందనుందని తెలిపారు. స్థిరమైన తాగునీటి వనరులో ఉప్పునీటి సాంద్రత సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆమోదం తెలిపినట్లు వివ‌రించారు. తమ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో 1.35 ల‌క్ష‌ల కార్యదర్శులు, 2.65 ల‌క్ష‌ల వాలంటీర్లలకు, మొత్తం 4 లక్షల మందికి ఏక కాలంలో ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెప్పుకొచ్చారు. జగనన్న తోడు ప‌థ‌కం కింద ఇప్పటివరకు 3 విడతలుగా చెల్లింపులు చేశామ‌ని వివ‌రించారు. అలాగే, వైఎస్సార్‌ బీమా ప‌థ‌కం కింద ఇప్పటి వరకు రూ.129.90 కోట్లు ఇచ్చామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడింది, ఏపీకి మరో రెండు సార్లు జగన్‌ సీఎంగా కొనసాగాలి, అప్పుడే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందని తెలిపిన సినీ నటుడు సుమన్

సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయాల్లోనే జరుగుతున్నాయన్నారు. జగనన్న తోడు కింద ఇప్పటివరకు 3 విడతలు ఇచ్చామన్నారు. వైఎస్సార్‌ బీమా కింద ఇప్పటి వరకు రూ.129.90 కోట్లు ఇచ్చామన్నారు. కోవిడ్‌ సమయంలోనూ వాలంటీర్లు సేవలందించారన్నారు.

నాటుసారాను ప్రోత్సహించే అవసరం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సభను తప్పుదో పట్టించాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. టీడీపీకి రోజూ ఏదోవిధంగా సభను అడ్డుకోవడం అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా టీడీపీ శవ రాజకీయాలు మానుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy On Irrigation Department: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం, పోలవరం నిర్మాణం - భద్రాచలం ముంపుపై కీలక ఆదేశాలు

CM Revanth Reddy: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం, వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉద్యోగులకు నష్టం కలిగించే పనులు చేయమని వెల్లడి

AP Government Key Order: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై తెలుగు భాషలోనూ జీవోలు జారీ చేయాలని ఆదేశాలు

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్