AP Cabinet Meeting: డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ.. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది.
Vijayawada, Nov 29: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం (AP Cabinet Meeting) డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా పంపాలని వివిధ శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఏపీకి తప్పిన తుపాను ముప్పు.. నేడు, రేపు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అటు తెలంగాణలో చలి పంజా
వీటిపై చర్చ ఉండొచ్చు
కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటు పాట్లు, సూపర్ సిక్స్ పథకాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు అదానీ వివాదం నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపైనా చర్చించే అవకాశం ఉంది.
నేడు తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’.. కరీంనగర్ లో పాల్గొననున్న కేటీఆర్