IPL Auction 2025 Live

Naadu-Nedu In AP: జగన్ మరో సంచలన నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్లు!, దేశంలోనే తొలిసారిగా కొత్త ప్రయోగం, నాడు-నేడు పథకం పూర్తి వివరాలు మీకోసం

దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

ap cm Jagan To Launch Naadu-Nedu Scheme On November 14 (Photo-Twitter)

Amaravathi, October 14:  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ముందుకు రానున్నాయి. రానున్న నాలుగేళ్లలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలని, సదుపాయాలు మెరుగుపర్చాలనే లక్ష్యంతో నాడు-నేడు కార్యక్రమం చేపడుతున్నారు. నవంబర్ 14 నుంచి దీన్ని స్టార్ట్ చేయనున్నారు. ప్రతి ఏడాది రూ. 1500 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.  నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా

నాడు-నేడు స్కీము ప్రకారం ఇప్పుడున్న స్కూల్ పరిస్థితిని ఫొటో తీస్తారు. ఆ తర్వాత రెండు నుంచి నాలుగేళ్లలోపు ఆ స్కూళ్లలో ఎలాంటి మార్పులు తెచ్చిందనే దానిపై నాలుగేళ్ల తరువాత మరోసారి ఫొటోలు తీస్తారు. ఈ ఫొటోలను ప్రజలకు చూపించి ప్రభుత్వం ఏ విధంగా స్కూల్స్ ను డెవలప్ చేసింది తెలియజేయాలనేది సీఎం జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పాఠశాల ఆధునీకరణ చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.  ఏపీ సీఎం జగన్ పుట్టినరోజున కొత్త స్కీమ్

నాడు నేడులో భాగంగా స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష

కాగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్.. కొత్త కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. వైఎస్ఆర్ వాహనమిత్ర, కంటి వెలుగు, రైతు భరోసా.. ఇలా అనేక స్కీమ్ లకు రూపకల్పన చేశారు. ఇప్పుడు కొత్తగా నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్‌లకు కాకుండా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని దేశంలోనే తొలిసారిగా అమలు చేయాలని జగన్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

పిల్లల భవిష్యత్‌కు భరోసా

అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ పద్ధతి వైపు మొగ్గుచూపామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రానున్న నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ స్కూల్స్ ని ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.