Cyclone Gulab: ఏపీ వైపు దూసుకొస్తున్న గులాబ్ తుఫాను, సీఎం జగన్‌కు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Amphan Cyclone (Photo credits: IMD)

Amaravati, Sep 26: ఏపీ, ఒడిషాలకు తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధమయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

తుపాను నేపథ్యంలో (Cyclone Gulab) అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను అనంతరం పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని (AP CM YS Jagan asks officials to make AP cyclone-ready) సూచించారు. కాగా, ఉత్తరాంధ్ర, దక్షిణా ఒడిశా తీరాలను గులాబ్‌ తుపాను తాకనుంది. ఈరోజు అర్థరాత్రి గోపాల్‌పూర్‌-కళింగపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దాంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సముద్రం అల్లకల్లోలం..తీవ్ర తుఫానుగా బలపడిన గులాబ్‌, వణుకుతున్న ఉత్తరాంధ్ర జిల్లాలు, ఒడిశాలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌, సైక్లోన్ రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం

Here's PM Tweet

గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో (Andhra Pradesh CM Jagan Mohan Reddy) ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ సురక్షితంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు.

కాగా, ఆదివారం అర్థరాత్రి గోపాల్‌పూర్‌-కళింగపట్నం మధ్య గులాబ్‌ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.