AP Cabinet Key Decisions: గత ప్రభుత్వ అవకతవకలపై సీబీఐ విచారణ, ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం
ఈ రోజు సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ (AP Cabinet) కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.
Amaravati, June 11: ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు (AP Cabinet Key Decisions) తీసుకుంది. ఈ రోజు సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ (AP Cabinet) కొద్దిసేపటి క్రితం ముగిసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. అదే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైఎస్‌ఆర్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. అనంతపురం యాడికిలో 20 కరోనా కేసులు, ఏపీలో 4,261కు చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, హోంక్వారంటైన్ లోకి 8 మంది జీజీహెచ్ వైద్యులు
ఈకేబినెట్ సమావేశంలో వైఎస్సార్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల ఆర్థిక సాయం చేయనున్నారు. ఆగష్టు 12న ఈ పథకాన్ని సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ప్రారంభిస్తారు.
అలాగే భోగాపురం, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి మంత్రి వర్గం ఓకే చెప్పింది.. రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులపై కేబినెట్‌లో చర్చించారు. విభజన హామీల్లో భాగంగా రామాయపట్నం పోర్టుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. కేంద్ర నిధుల సాధన కోసం ప్రయత్నిస్తూనే.. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. భక్తులతో పోటెత్తిన తిరుమల, 30 గంటల్లో 60 వేల టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు, అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్
ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మించాలని.. మొదటి దశలో పోర్టుకు రూ.4,736 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆగష్టు నాటికి టెండర్లు పిలవాలని అధికారులకు సీఎం సూచించారు.. అలాగే టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకి పంపాలన్నారు.
మరోవైపు గత ప్రభుత్వ హయాంలోని అవకతవకలపై కేబినెట్ సబ్‌కమిటీ సీఎం జగన్‌కు నివేదిక అందజేయగా.. కేబినెట్‌లో చర్చించారు. ఫైబర్ నెట్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించారు. ఇక ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఈనెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు
గత ప్రభుత్వంలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు మంత్రివర్గం ఉపసంఘం సిఫారసు
ఫైబర్ గ్రిడ్‌లో రూ.వెయ్యి కోట్ల టెండర్లలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు