Amaravati, June 11: ఆంధ్రప్రదేశ్‌లో (AP Coronavirus) గత 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా మరో 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,261 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు (Covid-19 cases) 1,641 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది. భక్తులతో పోటెత్తిన తిరుమల, 30 గంటల్లో 60 వేల టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు, అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్
రాష్ట్రంలో కోవిడ్–19 వైరస్ నిర్ధారణ పరీక్షలు 5 లక్షల మార్కుకు చేరువయ్యాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 15,384 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 4,98,716కు చేరుకుంది. బుధవారం ఒక్క రోజే కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 136 కేసులు రాష్ట్రంలో నమోదు కాగా, 56 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలో, 26 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి.
Here's AP Corona Report
— ArogyaAndhra (@ArogyaAndhra) June 11, 2020
అనంతపురం జిల్లా యాడికిలో తాజాగా 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో 13 మందిని ఐసోలేషన్‌కు పంపగా... 120 మందిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా కేసులతో మండలాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. గుంటూరులో కరోనా బాధితురాలికి ఆపరేషన్ చేసిన 8 మంది జీజీహెచ్ వైద్యులను హోంక్వారంటైన్ చేశారు. వైద్యులతో పాటు ఇద్దరు నర్సులు, సిబ్బందిని స్వీయ నిర్బంధంలో ఉంచారు. కరోనా ఉందని తెలియని ఓ మహిళకు వైద్యులు ఆపరేషన్ చేశారు. దీంతో వారందరినీ హోం క్వారంటైన్ చేశారు. డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాధితురాలిని ఏలూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలిస్తుండగా భర్తకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి పరీక్షలు చేయగా, ఫలితం నెగిటివ్ వచ్చింది.