Tirumala, June 11: తిరుమల ఆలయంలో భక్తులకు శ్రీవారి దర్శనం ప్రారంభమయ్యింది. మూడు రోజుల ట్రయల్ రన్ తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ టోకెన్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మందికి శ్రీవారి దర్శనభాగ్యం కలుగనుంది. టైం స్లాట్ టోకెన్ల ద్వారా మరో 3 వేల మందికి శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు. 53 మందికి వీఐపీ టిక్కెట్ల ద్వారా టీటీడీ దర్శనం కల్పించింది. టీటీడీ సిబ్బంది అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. టికెట్లు ఉన్నవారినే మాత్రమే దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య
కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్ లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనాలకు వచ్చిన భక్తులకు రాన్ డమ్ గా కోవిడ్ టెస్టులు నిర్వహించడానికి స్విమ్స్ లో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఆన్ లైన్ లో 60 వేల టికెట్లను 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేశారు. నేడు మూడువేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ట్రయల్ రన్ లో నిన్న శ్రీవారిని 7200 మంది స్థానికులు దర్శించుకున్నారు.
Here's Tirumala Darshan Photos
Tirumala Darshan Begins today. pic.twitter.com/m9RqThPuoY
— Tirumala Diaries (@TirumalaVenka19) June 8, 2020
ఇదిలా ఉంటే తిరుపతిలోని అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో దర్శన సమయ టోకెన్లను జారీ చేయడం మొదలైన తరువాత, వేల మంది పోటెత్తారు. స్థానికులు పెద్ద సంఖ్యలో టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులెవరూ భౌతిక దూరం పాటించక పోవడంతో అధికారులు తలపట్టుకున్నారు. అలిపిరి లింక్ బస్టాండ్ లో భక్తులను టీటీడీ సిబ్బంది దూరదూరంగా కూర్చోబెట్టారు. శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ నుంచి డీబీఆర్ హాస్పిటల్ వరకూ క్యూ లైన్ కనిపించింది.
1st day Tirumala Temple flower decoration
Tirumala Temple flower decoration for 1st day darshan after lockdown pic.twitter.com/oSSQY7z784
— GoTirupati (@GoTirupati) June 8, 2020
After 3 days of trial run, ordinary pilgrims having #Tirumala Balaji's Darshan. Six thousand devotees will be allowed for Darshana per day. #tirumalatirupatidevastanam #TTD pic.twitter.com/aEXHHJZim5
— Balakrishna - The Journalist (@Balakrishna096) June 11, 2020
నిన్న సాయంత్రానికే ఈ నెల 14 వరకూ 15 వేల టోకెన్లను జారీ చేశారు. మొదట ఒక రోజుకు సరిపడా 3,700 టోకెన్లు ఇవ్వాలని భావించినా, భక్తులు వేల సంఖ్యలో రావడంతో దాదాపు 15 వేలకు పైగా టోకెన్లను జారీ చేశారు. ఇక నేడు మరో మూడు రోజులకు సరిపడినన్ని టోకెన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. జూన్ 15 నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్ వార్త అవాస్తవం, ఇది పూర్తిగా తప్పుడు సమాచారం, ఇమేజీతో పాటు ఫ్యాక్ట్ చెకింగ్ వివరాల్ని పోస్ట్ చేసిన పీఐబీ
కాగా, అలిపిరి వద్దకు వచ్చే భక్తుల వద్ద ఉన్న దర్శన సమయం టోకెన్ పరిశీలించి, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాతనే కొండపైకి అనుమతిస్తున్నారు. తొలి రోజున శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్న సుమారు 300 మంది భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. టికెట్ తో పాటే తిరుమలలో గదిని కూడా కేటాయించే సదుపాయాన్ని కల్పించామని అధికారులు తెలిపారు.