Lockdown: జూన్ 15 నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్ వార్త అవాస్తవం, ఇది పూర్తిగా తప్పుడు సమాచారం, ఇమేజీతో పాటు ఫ్యాక్ట్ చెకింగ్ వివరాల్ని పోస్ట్ చేసిన పీఐబీ
PIB debunks fake news | (Photo Credits: Twitter/@PIBFactCheck

New Dlehi, June 11: దేశంలో ప్ర‌స్తుతం కరోనా కేసులు రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో పెరిగిపోతున్న విష‌యం విదిత‌మే. నిత్యం 9వేల‌కు పైగా కొత్త క‌రోనా కేసులు న‌మోదవుతున్నాయి. అయితే లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డం వ‌ల్లే ఇన్ని కేసులు వ‌స్తున్నాయ‌ని, క‌నుక జూన్ 15 నుంచి మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను (Complete Lockdown) అమ‌లు చేస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి స్థాయి లాక్‌డౌన్ మరోసారి విధించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) హల్‌చల్ చేస్తోంది.  కోవిడ్-19తో 10 కోట్ల మంది చనిపోతారట, స్పానిష్ ఫ్లూ మాదిరిగా కరోనా వ్యాప్తి భయకరంగా ఉంటుందని తెలిపిన ప్రముఖ జర్నల్ లాన్సెట్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తను పరిశీలిస్తే..‘‘జూన్ 15 తర్వాత దేశంలో మరోసారి పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధిస్తారు. దీనికి సంబంధించి హోంమంత్రి కొన్ని సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే రైల్లు, విమానాలు ఆపేస్తారు. దీంతో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమలవుతుంది’’ అనే సందేశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని పీఐబీ పేర్కొంది. తన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్‌ ట్విట్టర్ ఖాతాలో వైరల్ అవుతున్న ఇమేజీతో పాటు ఫ్యాక్ట్ చెకింగ్ వివరాల్ని పీఐబీ పోస్ట్ (PIB Fact Check) చేసింది.

Here's PIB Fact Check

కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, హోంమంత్రిత్వ కార్యాలయం నుంచి కానీ లాక్‌డౌన్ పొడగింపుకు సంబంధించి ఎలాంటి సంకేతాలు రాలేదని, ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌‌‌కి సంబంధించి వస్తున్న సమాచారం అవాస్తవమని తెలిపింది. ఈ విష‌యంపై వ‌చ్చే వార్త‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ న‌మ్మ‌కూడద‌ని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్నపేషెంట్ ఆత్మహత్య, కోవిడ్-19 పోతుందని 400 గొర్రెలు ఝార్ఖండ్‌లో బలిచ్చారు, డేంజర్ జోన్‌లో ఢిల్లీ, భారత్‌లో 8 వేలు దాటిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ నుంచి నివారణ పొందేందుకు విధించిన లాక్‌డౌన్‌తో విధించిన ఆంక్షల్ని ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారు. రెండు నెలలకు పైగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌తో ఇంటికి పరిమితమైన ప్రజలు ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచాన్ని చూస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో మరోసారి లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ కొందరు అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు.