CM Jagan Review: ఆరోగ్య ఆసరా కింద మహిళలకు రూ.5 వేల నగదు, ఉచిత చికిత్సకు ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరి, రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ బలోపేతం, ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు
ఈ సమావేశంలో భవిష్యత్తులో అంగన్‌వాడీ (Anganwadi) కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. ప్రసవం అయిన మహిళలకు ఆరోగ్య ఆసరా కింద ఐదువేల రూపాయలు అందించాలని సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
Amaravati, July 23: అంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణపై ఏపీ సీఎం సమీక్షా సమావేశం (AP CM YS Jagan Review) నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో అంగన్‌వాడీ (Anganwadi) కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. ప్రసవం అయిన మహిళలకు ఆరోగ్య ఆసరా కింద ఐదువేల రూపాయలు అందించాలని సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌కు చేరిన మూడు రాజధానుల బిల్లు, ఆమోదించవద్దని గవర్నర్‌కు చంద్రబాబు లేఖ, నిబంధనల ప్రకారమే గవర్నర్ చెంతకు చేరాయన్న వ్యవసాయమంత్రి కన్నబాబు
గర్భవతులు, బాలింతలు సహా 36 నెలలోపున్న శిశువులను ఒక విధంగా, 36 నుంచి 72నెలల వరకున్న చిన్నారులను మరో విధంగా చూడాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అంగన్‌వాడీలోని పిల్లలకు లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ, సహా ప్రత్యేక పుస్తకాలను అందించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీల్లో ఆహారం ఎక్కడ తిన్నా ఒకే నాణ్యత ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ -2లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని , దీనిపై సమగ్రంగా ఆలోచించి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. సిలబస్‌పైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Here's AP CMO Tweets
రైతులను ప్రభుత్వం విధాలుగా ఆదుకుంటుందని సీఎం తెలిపారు.. రూ. 4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రతీ మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చెంతకే మళ్లీ నిమ్మగడ్డ ఫైలు, ఎస్‌ఈసీ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన గవర్నర్, సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున నిర్ణయం తీసుకోలేమంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటు అందించాలని.. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని సీఎం సూచించారు. ‘‘ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో గోదాంలు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్ర పరికరాలు ఉంటాయి. తన వద్ద పలానా పంట ఉందని రైతు ఆర్బీకేకు సమాచారం ఇస్తాడు..ఆ సమాచారం ఆధారంగా నేరుగా సెంట్రల్ సర్వర్‌కు చేరాలి. సెప్టెంబర్ నెలకల్లా ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపొందించాలి’’ అని అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు తప్పనిసరి
కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు తీసుకుని నెట్‌వర్క్ ఆస్పత్రులకు వెళ్లాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ నాగార్జున బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులేకపోతే ఆధార్‌కార్డు ఆధారంగా సీఎంసీఓ లెటర్‌ను తీసుకెళ్లాలని తెలిపారు.
అప్పుడు మాత్రమే ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలందుతాయన్నారు. కరోనా రోగులను తరలించేటప్పుడు 104, 108 సిబ్బంది తమతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని రావాలని రోగులకు చెప్పాలని కోరారు. ఈ విషయం తెలియక అనేక మంది రోగులు ఆస్పత్రులకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ప్యాకేజీలు ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు.