Mana Palana- Mee Suchana: మన పాలన – మీ సూచనలో ఏపీ సీఎం వైయస్ జగన్, మే 30వ తేదీ వరకూ జరగనున్న కార్యక్రమం, ఈ ఏడాది పథకాల క్యాలండర్ ఇదే

ఈ కార్యక్రమం నేటి నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో ('Mana Palana- Mee Suchana' program) మేథోమధన సదస్సు ప్రారంభించారు.

YSR Navasakam to identify welfare scheme beneficiaries (Photo-Twitter)

Amaravati, May 25: వైసీపీ ప్రభుత్వం (YSRCP Govt)అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ (Mana Palana- Mee Suchana) పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం నేటి నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో ('Mana Palana- Mee Suchana' program) మేథోమధన సదస్సు ప్రారంభించారు. 65 రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన నారా చంద్రబాబునాయుడు, లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ ప్రతిపక్షనేత

తొలి రోజు పాలన వ్యవస్థలో వికేంద్రీకరణ, సచివాలయాల వ్యవస్థపై చర్చ.. లబ్ధిదారులు, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారితో ఇష్టాగోష్టి... ప్రభుత్వ పనితీరుపై సూచనలు, సలహాలను స్వీకరించారు. అలాగే వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన వారితో ఇష్టా గోష్టితో పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రజల సూచనలు, సలహాలను స్వీకరించారు. మొదటి రోజు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వెల్లడించారు. అలాగే లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రికవరీ రేటులో ఏపీ టాప్, మొత్తంగా 1848 మంది కోలుకుని డిశ్చార్జి, 767 యాక్టివ్ కేసులు, ఏపీలో 2671కి చేరిన కోవిడ్ 19 కేసులు

ఈ సంధర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ.. వ్యవస్థలో మార్పు తీసుకువస్తేనే తప్ప, ప్రజలను మనం ఆదుకోలేమనే భావన కలిగిందని, సుపరిపాలన అందించేందుకు ఒక​ వ్యవస్థను తీసుకొచ్చామని అన్నారు. ఆ వ్యవస్థే.. గ్రామ సచివాలయ వ్యవస్థ అని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని సీఎం జగన్‌ ప్రశంసించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల వ్యవస్థ ద్వారా వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు.

రాష్ట్రంలో 43 వేల బెల్టుషాపులను తొలగించామని, మద్యం అమ్మకాల్లో ప్రైవేట్ వ్యక్తులను కూడా తొలగించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. షాక్ కొట్టే విధంగా మద్యం ధరలు పెంచడంతో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయన్నారు. నాడు- నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని, ప్రతి గ్రామంలో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్సార్‌ విలేజ్ క్లినిక్‌లను ప్రారంభిస్తామన్నారు. 24 గంటలపాటు గ్రామాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రైతులు ఎలాంటి పంటలు వేసుకోవాలో వ్యవసాయ నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తామని వెల్లడించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, త్వరలో గ్రామాల్లో జనతా బజారు తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 90 శాతం మేనిఫెస్టోను పూర్తి చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. జులై 8, 2019 వైఎస్సార్‌ పెన్షన్ కానుక ప్రారంభించాం. గత ప్రభుత్వం 44 లక్షల పెన్షన్లు ఇస్తే..ప్రస్తుతం 58 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గత సర్కార్ రూ.1000 పెన్షన్ ఇస్తే.. ఈ ప్రభుత్వం రూ.2,250 పెన్షన్ ఇస్తోంది. 69 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాం.

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,110 కోట్ల సబ్సిడీ అందించాం. అన్ని పథకాలను గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే చేరుస్తున్నాం. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చాం. 18 దిశ పీఎస్‌లను ఏర్పాటు చేశాం. 81 వేల మంది చేనేతలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. 82 లక్షల మంది పిల్లలకు చేయూతగా 43 లక్షల మంది తల్లుల అకౌంట్‌లో అమ్మఒడి విద్యాదీవెన కింద రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాం. అని పేర్కొన్నారు.

జులై 8 దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా 28 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. రేపు అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‌లకు రూ.5వేల చొప్పున సాయం చేస్తామన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన క్యాలెండర్‌

మే22న ఎంఎస్‌ఎంఈలకు :

గత ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన ప్రోత్సాహకాల (ఇన్సెంటివ్‌) మొత్తం రూ.905 కోట్లలో సగం చెల్లింపు. మిగిలిన సగం మొత్తం జూన్‌లో చెల్లింపు. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు దాదాపు 10 లక్షల ఉద్యోగాలను ఇస్తున్నాయి. ఆ యూనిట్లు వాటి కాళ్ల మీద అవి నిలబడాలి. అందుకే కరెంటు ఫిక్స్‌డ్‌ చార్జీలు కూడా రద్దు చేస్తూ జీవో ఇచ్చాం. 3 నెలల పాటు ఆ చార్జీలు రద్దు అవుతాయి.

మే 26న వన్‌టైం సహాయం:

అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లకు రూ.5 వేల చొప్పున వన్‌టైం సహాయం.

మే 30న ఆర్‌బీకేలు ప్రారంభం:

రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ప్రారంభం అవుతాయి. గ్రామాల ఆర్థిక వ్యవస్థను ఇవి మారుస్తాయి. వీటి కోసం ఒక జాయింట్‌ కలెక్టర్‌ను కూడా పెట్టాం. గ్రామాల్లో ఆర్బీకేలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయి.

జూన్‌ 4న వాహన మిత్ర :

వైఎస్సార్‌ వాహన మిత్ర ఇస్తున్నాం. సొంత ఆటో, సొంత క్యాబ్‌ ఉన్న వారికి ఆ రోజు రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తాం.

జూన్‌ 10న పదివేల సాయం:

నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు.. షాపులున్న ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఏడాదికి ఒకసారి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మేరకు ఇస్తున్నాం.

జూన్‌ 17న నేతన్న నేస్తం :

మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద రూ.24 వేలు ఇస్తాం. ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ ఇదే తేదీన చెల్లిస్తాం. మాస్క్‌ల తయారీకి ఆప్కో నుంచి బట్ట తీసుకున్నాం. అందుకు సంబంధించిన డబ్బు కూడా వెంటనే చెల్లిస్తున్నాం.

జూన్‌ 24న కాపు నేస్తం:

వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నాం. 45–60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి అక్కకూ తోడుగా ఉండేందుకు రూ.15 వేలు ఇస్తున్నాం.

జూన్‌ 29న ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత:

ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల.

జూలై 1న కొత్త అంబులెన్స్‌లు :

104, 108 కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం. మొత్తం 1,060 కొత్త వాహనాలు ప్రారంభం. ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.

జూలై 8న ఇళ్ల స్థలాలు:

వైఎస్సార్‌ పుట్టిన రోజున అర్హులైన పేదలందరికీ 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ.

జూలై 29న వడ్డీలేని రుణం: రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తాం.

ఆగస్టు 3న విద్యాకానుక:

జగనన్న విద్యా కానుక అమలు. ఈ పథకం కింద పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగు, బెల్టు, షూలు, సాక్సులు ఇస్తాం.

ఆగస్టు9న ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు:

ఆదివాసీ దినోత్సవం నాడు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పంపిణీ. ఐటీడీఏలున్న కలెక్టర్లు అందరూ దీనిపై దృష్టి పెట్టాలి.

ఆగస్టు 12న వైఎస్సార్‌ చేయూత :

ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కకు 45–60 ఏళ్ల మధ్య ఉన్నవారికి రూ.18,750 ఆ రోజు ఇస్తాం.

ఆగస్టు 19న జగనన్న వసతి దీవెన కార్యక్రమం అమలు:

ఉన్నత చదువులు చదువుతున్న పిల్లలకు భోజనం, వసతి ఖర్చుల కోసం తల్లులకు రూ.10 వేల చొప్పున మొదటి దఫా ఇస్తాం.

ఆగస్టు 26న గృహ నిర్మాణం ప్రారంభం:

15 లక్షల వైఎస్సార్‌ గృహాల నిర్మాణం ప్రారంభం. ఎకానమీని ఇది ఓపెన్‌ చేస్తుంది.

సెప్టెంబర్‌ 11న వైఎస్సార్‌ ఆసరా అమలు:

ఎన్నికల నాటికి ఉన్న రుణాలను నాలుగు దఫాల్లో డ్వాక్రా అక్క చెల్లెమ్మల చేతికిచ్చి, వారికి తోడుగా ఉంటామని చెప్పాం. ఇందులో భాగంగా మొదటి దఫా ఆసరాకు ఆ రోజు శ్రీకారం చుడతాం.

సెప్టెంబర్‌ 25న విద్యాదీవెన:

జగనన్న విద్యా దీవెన ప్రారంభం. కాలేజీలకు బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పటికే ఇచ్చాం. ఆ రోజు ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు నేరుగా పిల్లల తల్లుల చేతికే ఇస్తాం.

అక్టోబర్‌లో రైతు భరోసా రెండో విడత:

వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత సాయం చేస్తాం. ప్రతి కుటుంబానికి రూ.4 వేల చొప్పున రైతులకు ఇస్తాం. పంట కోసుకునేందుకు లేదా రబీ అవసరాల కోసం ఈ మొత్తం ఉపయోగపడుతుంది. తేదీ తర్వాత ప్రకటిస్తాం.

అక్టోబర్‌లో జగనన్న తోడు:

హాకర్స్‌కు సంబంధించి ఆర్థిక సహాయం చేస్తాం. చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ అనే కార్యక్రమం కింద ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు ఇస్తాం. వారికి వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రూ.10 వేల చొప్పున రుణాలు మంజూరు చేయిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి మేలు జరుగుతుంది.

నవంబర్‌లో విద్యా దీవెన:

జగనన్న విద్యా దీవెన రెండో దఫా మొత్తం ఇస్తాం. పిల్లల ఫీజులు నేరుగా తల్లుల ఖాతాకు జమ చేస్తాం.

డిసెంబర్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులకు సహాయం:

ఆ సమయానికి కలెక్టర్లు, ఎస్పీలు, సీఐడీ విభాగాలు.. కోర్టుల నుంచి అనుమతులు తీసుకోవాలి. జాబితాలను ఆమోదింప చేయించుకోవాలి.

2021 జనవరిలో అమ్మ ఒడి:

రెండో ఏడాది ఈ కార్యక్రమం కింద పిల్లలను బడులకు పంపించే తల్లులకు 15 వేల రూపాయల చొప్పున చెల్లింపు.

2021 జనవరిలో వైఎస్సార్‌ రైతు భరోసా చివరి విడత:

సంక్రాంతి నాటికి పంటను ఇంటికి తెచ్చుకునే సమయంలో రూ.2 వేలు చొప్పున ఇస్తాం. 2021 ఫిబ్రవరిలో: జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికానికి సంబంధించిన మొత్తం ఇస్తాం. అలాగే వసతి దీవెన కూడా రెండో దఫా ఇస్తాం. 2021 మార్చిలో: పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం.