CM YS Jagan Review: ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం, వరదల్లో చనిపోయిన వారికి రూ. 5 లక్షల పరిహారం, పంట నష్టం అంచనాలను అక్టోబర్‌ 31లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం (Rs 5 lakh compensation to the families) అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సూచించారు. దీంతో పాటు పంట నష్టం అంచనాలను అక్టోబర్‌ 31లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Oct 20: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం (Rs 5 lakh compensation to the families) అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) సూచించారు. దీంతో పాటు పంట నష్టం అంచనాలను అక్టోబర్‌ 31లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

వర్షాలు, కోవిడ్‌, వార్డు సెక్రటేరిట్స్‌ తనిఖీలు, నాడు-నేడు (Nadu-Nedu) తదితర అంశాలపై మంగళవారం ఆయన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష(CM YS Jagan Review) నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్, బీమా మొత్తం రూ. 1.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంపు, పది రోజుల పాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం

ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. కలెక్టర్లు మానవతా ధృక్పదంతో పనిచేస్తూ.. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వారికి సహాయం అందించాలన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా 31లోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే కరెంట్‌ పునరుద్ధరణను వేగంగా చేపట్టినందుకు కలెక్టర్లను సీఎం జగన్‌ అభినందించారు. ఈ నెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు‌ వెల్లడించారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో ఇస్తున్నాం.ఈ ఏడాది ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని వైయస్సార్‌ రైతు భరోసా రెండో విడత చెల్లింపులతో పాటు ఇవ్వబోతున్నాం.జూన్, జూలై, ఆగస్టుతో పాటు, సెప్టెంబరు నెల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈనెల 27న ఇస్తున్నాం. ఖరీఫ్‌ పంటలకు సంబంధించి రూ.113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి మరో రూ.32 కోట్లు. మొత్తం రూ.145 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు చెల్లించబోతున్నాం. అక్టోబరు నెలకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీపై నవంబరు 15లోగా నివేదిక ఇవ్వాలి. అటవీ భూముల పట్టాలు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ఇచ్చిన గిరిజనులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా కింద ఈనెల 27న రూ.11,500 చొప్పున ఇవ్వబోతున్నామని తెలిపారు.

 సీఎం జగన్ క్రిస్టియన్ అయితే నిరూపించండి, ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు? పిటిషనర్‌ను ప్రశ్నించిన ఏపీ హైకోర్టు, ఏపీ సీఎం మతం ఏంటో చెప్పాలని పిటిషన్

కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి సంబంధించిన సర్వే చూస్తే, కోవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఒక 10 శాతం కేసుల్లో మళ్లీ కొత్తగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ, బ్రెయిన్, చెవుడు వంటి పలు సమస్యలు వస్తున్నాయి. కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా కనీసం 6 వారాల నుంచి 8 వారాల పాటు రోగులు జాగ్రత్తగా ఉండాలన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.వారికి ఓరియెంటేషన్‌ నిర్వహించాలి.పోస్టు కోవిడ్‌ అనారోగ్య సమస్యలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చామని ఏపీ సీఎం తెలిపారు.