AP Coronavirus Updates: అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్, ఏపీలో తాజాగా 6,045 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు, వచ్చే నెల 5 వరకు తిరుపతిలో పూర్తి స్థాయి ఆంక్షలు

దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా తన ఆరోగ్యంపై స్పందించిన అంబటి రాంబాబు కరోనా పాజిటివ్‌గా (Corona Positive) వచ్చిందని చెప్పారు. తాను చాలా ధైర్యంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో (Selfie Video) విడుదల చేశారు.

COVID-19 Outbreak in India | File Photo

Amaravati, July 22: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (YCP MLA Ambati Rambabu) కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా తన ఆరోగ్యంపై స్పందించిన అంబటి రాంబాబు కరోనా పాజిటివ్‌గా (Corona Positive) వచ్చిందని చెప్పారు. తాను చాలా ధైర్యంగా ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో (Selfie Video) విడుదల చేశారు. వైసీపీలో కరోనా కలకలం, సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతల ట్వీట్‌లు

‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయం తెలిసి చాలా మంది కాల్స్‌ చేస్తున్నారు. కానీ ఐసోలేషన్‌లో ఉండటం వల్ల వారికి సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ఒక ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా ధైర్యంగా ఉన్నాను.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఉదయమే నాకు కరోనా సోకినట్టుగా నిర్దారణ అయింది. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తాను’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Here's MLA Ambati Rambabu Selfie Video

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 6,045 కరోనా పాజిటివ్‌ కేసులు (AP CoronaVirus) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,713కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 49,553 శాంపిల్స్‌ పరీక్షించగా 6,045 మందికి కోవిడ్-19గా నిర్ధారణ అయినట్టు పేర్కొంది.

Here's AP Corona Report

కొత్తగా కరోనా వైరస్ తో కోలుకున్న 6,494 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 32,127కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,763 కోవిడ్యా-19 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా కరోనాతో 65 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 823గా నమోదైంది. మరోవైపు ఏపీలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 14,35,827 శాంపిల్స్‌ను పరీక్షించారు.

కరోనా ఆంక్షల నేపథ్యంలో తిరుపతి మొత్తం కంటైన్‌మెంట్ జోన్లు ఉంటాయ‌ని ఎస్పీ ర‌మేష్ రెడ్డి తెలిపారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా దుకాణాల‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా భౌతిక దూరం పాటించాల‌ని కోరారు.

ఆంక్ష‌ల స‌మ‌యంలో ప్రైవేటు వాహ‌నాల‌కు న‌గ‌రంలోనికి అనుమ‌తి ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ప్రైవేటు వాహ‌నాల్లో తిరుమ‌ల‌కు వెళ్లేవారు బైపాస్ రోడ్ మార్గం ద్వారా వెళ్లాల‌ని ఎస్పీ సూచించారు. ద్విచ‌క్ర వాహ‌నాల్లో సైతం ఒక్క‌రికే అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే జ‌రిమానాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపారు.



సంబంధిత వార్తలు