YSRCP MP Vijayasai Reddy self quarantined as a mark of coronavirus caution (Photo-Twitter)

Amaravati, July 22: ఏపీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కరోనా కలకలం మధ్య సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. విజయసాయి రెడ్డితో (YSRCP MP Vijayasai Reddy) పాటు  ఆయన పీఏకు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకి (self quarantine) వెళ్లిపోయారు. వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ట్వీట్ (Twitter) చేశారు. ఏపీలో తాజాగా 4,994 కరోనా కేసులు నమోదు, ఒక్కరోజులో 62 మంది మృత్యువాత, రాష్ట్రంలో 58,668కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్లు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తెలిపారు. అత్యవసరం అయితే తప్ప టెలిఫోన్‌లో కూడా అందుబాటులో ఉండబోనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఐతే కరోనా పాజిటివ్ (Coronavirus Positive) వచ్చిన విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సహా ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు (YCP MLAs) కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తిన శివకుమార్ కరోనా బారినపడ్డారు. తాజాగా, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సైతం కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి.

Here's YSRCP MP Tweet

విజయసాయిరెడ్డి తాను క్వారంటైన్‌లో ఉంటున్నట్టు ప్రకటించిన వెంటనే టీడీపీ నేత అనిత వంగలపూడి స్పందించారు. అయితే ఆమె విజయసాయిరెడ్డికి కరోనా వచ్చినట్టు ట్వీట్ చేశారు. రాజకీయంగా విభేదించిన.. కరోనాపై కలిసి పోరాడాల్సిందేని ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఆమె టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్వీట్ ట్యాగ్ చేశారు. అందులో మాత్రం సాయిరెడ్డికి కరోనా వచ్చినట్టు రాసి ఉంది. ఆ తర్వాత మిగతా వార్తా సంస్థలు కూడా సాయిరెడ్డికి కరోనా వచ్చినట్టు వార్తలు రాశాయి.

Here's TDP Leaders Tweets

విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్తలతో సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్‌లు, పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు రాజకీయాలతో సంబంధం లేకుండా టీడీపీ నేతలు కూడా ఈ మహమ్మారిపై గెలవాలని ఆకాంక్షించారు. ‘విజయసాయిరెడ్డి గారు మీకు నిజంగానే కరోన సంక్రమిస్తే మీరు వైరస్ ని జయించి..రావాలి. టెస్టులు,వైద్యం మన రాష్ట్రం లోనే చేయించుకోండి.మన రాష్ట్ర ప్రజలకి మనోధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది.. విజయోస్తు.. సుఖీభవ’అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా స్పందించారు. రాజకీయంగా ట్విట్టర్ ప్రత్యర్థులమే తప్ప వ్యక్తిగతంగా మా మధ్య ఎటువంటి గట్టు తగాదా లేదు. ఎంపీ విజయసాయిరెడ్డి గారు కనికరం లేని కరోనా బారిన పడటం బాధాకరం. ఆయన కరోనా నుండి త్వరగా కోలుకుని ట్విట్టర్ లో యాక్టివ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అన్నారు. రాజకీయంగా విభేదించినా ఈ కరోనాకి అందరం ఒకటే. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్వీట్ చేశారు.