AP Coronavirus Update: అదిరిపోయే శుభవార్త, ఏపీలో ఆరు లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ కేసులు కేవలం 64,876 మాత్రమే, తాజాగా 6,923 మందికి కరోనా, 7,796 మంది రికవరీ
6,923 పాజిటివ్ కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు చేరింది. నిన్న ఒక్కరోజే 7,796 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 64,876 (Coronavirus cases in Andhra Pradesh). వైరస్ బాధితుల్లో కొత్తగా 45మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 5,708కు (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Amaravati, Sep 27: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 76,416 నమూనాలు పరీక్షించగా.. 6,923 పాజిటివ్ కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,674కు చేరింది. నిన్న ఒక్కరోజే 7,796 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,05,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 64,876 (Coronavirus cases in Andhra Pradesh). వైరస్ బాధితుల్లో కొత్తగా 45మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 5,708కు (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రకాశం 8, కృష్ణా 6, గుంటూరు 5, తూర్పుగోదావరి, 4, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. చిత్తూరు 2, విజయనగరం జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈ రోజు కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 1,006, పశ్చిమగోదావరి జిల్లాలో 929, ప్రకాశం 659 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో తాజాగా 88,600 కోవిడ్ కేసులు, 50 లక్షలకు చేరువలో రికవరీల సంఖ్య, 94,503కు చేరిన మరణాల సంఖ్య
ఏపీ కేబినెట్ మరోసారి భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో అక్టోబర్ 1న సమావేశం (Andhra Pradesh cabinet meeting on October 1st) జరగనుంది.
ఈ నెల సెప్టెంబర్ 3న నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో (AP Cabinet Meeting) ‘ఉచిత విద్యుత్– నగదు బదిలీ’ అంశంపై చర్చ జరిగింది. రమ్మీ, బెట్టింగ్‌లపై నిషేధం, రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి, ఏపీఎస్‌డీసీకి ఆమోదం, వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్ సిగ్నల్ వంటి పలు కీలక నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.