New Delhi, Sep 26: ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా కరోనావైరస్ వ్యాక్సిన్లు (Coronavirus Vaccines) అభివృద్ధి చెందుతున్నాయి. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి త్వరగా ఒకదాన్ని మార్కెట్లోకి తీసుకురావాలనే ఆశలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉన్నాయి. US ప్రభుత్వ ఆపరేషన్ వార్ప్ స్పీడ్ చొరవతో సహా, 10 బిలియన్ డాలర్ల ఖర్చుతో, జనవరి 2021 నాటికి 300 మిలియన్ మోతాదుల సురక్షితమైన, సమర్థవంతమైన కరోనావైరస్ వ్యాక్సిన్‌ను ( Dozens of Coronavirus vaccines) అభివృద్ధి చేసి పంపిణీ చేయడమే లక్ష్యంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలను సమన్వయం చేయడం, 2021 చివరి నాటికి రెండు బిలియన్ మోతాదులను పంపిణీ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
అయితే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సాధారణంగా 10 నుండి 15 సంవత్సరాలు పట్టవచ్చు. టీకాలు ఆమోదం కోసం రెగ్యులేటరీ ఏజెన్సీలకు పంపే ముందు మూడు-దశల క్లినికల్ ట్రయల్ ప్రక్రియ ద్వారా వెళతాయి. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. దీనికి నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. వ్యాక్సిన్ ఆమోదించబడిన తరువాత కూడా, ఉత్పత్తి మరియు పంపిణీని పెంచేటప్పుడు ఇది అనేక సమస్యలను ఎదుర్కుంటుంది. ఇందులో ఏ జనాభా మొదట పొందాలో మరియు ఏ ధరతో నిర్ణయించాలో కూడా ఉంటుంది. అనేక టీకాలు రెగ్యులర్ అధ్యయనం యొక్క శాశ్వత దశ అయిన నాలుగవ దశలో కూడా ఉంటాయి.
అత్యవసర అవసరాన్ని బట్టి, కొంతమంది వ్యాక్సిన్ డెవలపర్లు ఒకేసారి ట్రయల్ దశలను అమలు చేయడం ద్వారా SARS-CoV-2 కొరకు క్లినికల్ ప్రక్రియను కుదించుకుంటున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 1 నాటికి వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాటు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రాలను ఒత్తిడి చేస్తోంది. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో వస్తున్నాయి. దీంతో అక్కడ వ్యాక్సిన్ అనేది అత్యవసరం అయింది. అందుకని ట్రంప్ సర్కారు వ్యాక్సిన్ త్వరగా తీసుకురావాలని కంపెనీలను ఒత్తిడి చేస్తోంది.
COVID-19 తయారీ దారులు, అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే, తప్పనిసరిగా రోగనిరోధక వ్యవస్థను పెంచడమే లక్ష్యంగా టీకాలను తీసుకువస్తున్నారు. ఇది సహజ సంక్రమణ ద్వారా అందించబడే దానికంటే కొన్నిసార్లు బలంగా ఉంటుంది మరియు తక్కువ ఆరోగ్య పరిణామాలతో వస్తుంది. ఇందులో ఏ కంపెనీ వ్యాక్సిన్ విజయవంతమవుతుందో చెప్పడం కష్టమే. ఇప్పుడు ఆశలు రేపుతున్న 10 వ్యాక్సిన్ల పురోగతి వివరాలను ఓ సారి పరిశీలిస్తే..
యూఎస్ కంపెనీ మోడర్నా ఇంక్ (Moderna Therapeutics)
Name: mRNA-1273
యూఎస్ Massachusetts-based biotech company మోడర్నా ఇంక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కోవిడ్-19కు ఇమ్యూనిటీ(రోగ నిరోధక శక్తి)ని పెంచేందుకు సహాయపడుతోంది. ఈ వ్యాక్సిన్‌పై జులై 17 నుంచి 30,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను మోడార్నా ప్రారంభించింది.
జర్మనీ ఫైజర్- బయోఎన్‌టెక్ (Pfizer)
Name: BNT162b2
న్యూయార్క్ కేంద్రంగా ఉన్న జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ కంపెనీ ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత వ్యాక్సిన్ ఫైజర్ ఇంక్‌ను అభివృద్ధి చేసింది. జులై 27 నుంచీ రెండు, మూడో దశల క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తోంది. యూఎస్‌తోపాటు బ్రెజిల్, జర్మనీ తదితర దేశాలలో వీటిని చేపట్టింది. ఒక్క యూఎస్‌లోనే 43,000 మందిపై ప్రయోగాలు చేపట్టే ప్రణాళికల్లో ఉంది.
ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్ (University of Oxford)
Name: ChAdOx1 nCoV-19
చింపాంజీ ఎడినోవైరస్ ఆధారంగా ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్- స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రూపొందించింది. మే నెలలో రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలలో 17,000 మందిపై పరీక్షించింది. మూడో దశలో భాగంగా యూఎస్‌లో 30,000 మందిపై పరీక్షిస్తోంది. దేశీయంగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 1,700 మందిపై ప్రయోగాలు చేపట్టింది.
జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson)
Name: JNJ-78436735
న్యూ జెర్సీ కేంద్రంగా ఎడెనోవైరస్ వెక్టర్(ఏడీ26) ఆధారంగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఇదే ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ ఇంతక్రితం ఎబోలా, జికా, ఆర్‌ఎస్‌వీ తదితరాలకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఇది సింగిల్ డోసేజీలో రూపొందింది. ఈ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. వివిధ దేశాలలో 60,000 మందిపై పరీక్షించే ప్రణాళికల్లో ఉంది.
రష్యా స్పుత్నిక్-వి
రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి తొలిసారి అధికారిక రిజిస్ట్రేషన్ పొందింది. అయితే రెండు పరీక్షలు పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలను ఈ నెల నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. 40,000 మందిపై రష్యాలో ప్రయోగాలు చేస్తోంది. మరోవైపు దేశీయంగా తయారీతోపాటు, మూడో దశ క్లినికల్ పరీక్షలకు వీలుగా డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
భారత్ బయోటెక్
ఇండియలో ఐసీఎంఆర్‌తో భాగస్వామ్యంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అందించిన స్ట్రెయిన్ ఆధారంగా ఇనేక్టివేటెడ్ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను కోతులపై ప్రయోగించగా మంచి ఫలితాలను సాధించినట్లు తెలుస్తోంది. జులై నుంచీ తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను చేపట్టింది. అక్టోబర్‌లో మూడో దశ పరీక్షలను ప్రారంభించే సన్నాహాల్లో ఉంది.
జైడస్ క్యాడిలా
ప్లాస్మిడ్ డీఎన్‌ఏగా పిలిచే వ్యాక్సిన్‌ను జెనెటిక్ మెటీరియల్ ఆధారంగా రూపొందించినట్లు జైడస్ క్యాడిలా పేర్కొంది. వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను జులైలో చేపట్టింది. మరో 15,000-20,000 మందిపై మూడో దశ పరీక్షలు చేపట్టాలని యోచిస్తోంది.
సనోఫీ- జీఎస్‌కే
జీఎస్‌కేతో భాగస్వామ్యంలో దేశీయంగా తయారీ, పంపిణీ సామర్థ్యాలు కలిగిన సనోఫీ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ప్రొటీన్ సబ్‌యూనిట్ ఆధారిత ఈ వ్యాక్సిన్‌పై తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలను ఈ నెల 3న ప్రారంభించింది.
చైనా క్యాన్సినో బయోలాజిక్స్ (CanSino Biologics)
Name: Ad5-nCoV
హ్యూమన్ ఎడినోవైరస్(ఏడీ5) ఆధారంగా చైనా కంపెనీ క్యాన్సినో బయోలాజిక్స్ వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఇందుకు బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మిలటరీ మెడికల్ సైన్స్ అకాడమీ సహకారాన్ని తీసుకుంది. ప్రత్యేక అవసరాలరీత్యా చైనీస్ మిలటరీ ఈ వ్యాక్సిన్‌ను జూన్ 25న అనుమతించినట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌లో 40,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. ఇందుకు రష్యా, పాకిస్తాన్, సౌదీ అరేబియా నుంచి అనుమతి పొందింది.
యూకే నోవావాక్స్
రీకాంబినెంట్ నానోపార్టికల్ టెక్నాలజీ ఆధారంగా వ్యాక్సిన్లను రూపొందించే ప్రయత్నాలు చేస్తోంది. 1.5 బిలియన్ డాలర్లను ఇందుకు వెచ్చించినప్పటికీ ప్రయత్నాలు పెద్దగా సఫలంకాలేదని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే కోవిడ్-19కు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మంచి ఫలితాలనివ్వగలదని కంపెనీ భావిస్తోంది. యూకే ప్రభుత్వ సహకారంతో ఈ నెల 24 నుంచీ యూకేలో 10,000 మందిపై మూడో దశ క్లినికల్ పరీక్షలను ప్రారంభించింది. ఏడాదికి 2 బిలియన్ డోసేజీల తయారీకి దేశ కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
Name: Bacillus Calmette-Guerin BRACE trial
మెల్బోర్న్ విశ్వవిద్యాలయ సహకారంతో ఆస్ట్రేలియాలో అతిపెద్ద పిల్లల ఆరోగ్య పరిశోధనా సంస్థ ఈ వ్యాక్సిన్ ను తీసుకువస్తోంది. ఏప్రిల్‌లో, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షల శ్రేణిని ప్రారంభించారు, ఇది బిసిజి కరోనావైరస్పై కూడా పని చేస్తుందో లేదో పరీక్షిస్తుంది. 10,000 మంది ఆరోగ్య కార్యకర్తలను ఈ అధ్యయనంలో చేర్చుకోవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.