TTD Immovable Properties: 2016 టీటీడీ బోర్టు నిర్ణయాన్ని నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం, స్వామీజీలు,ధార్మిక సంస్థలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచన

2016లో టీటీడీకి చెందిన 50 ఆస్తులు (TTD Immovable Properties) విక్రయించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Govt) నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి బోర్డు నిర్ణయాన్ని తాజా బోర్డుకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో ( YV Subba reddy) మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ నిర్ణయాలు ఏవైనా స్వామీజీలు, ధార్మిక సంస్థలతో చర్చించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.

tirumala-srivari-brahmotsavam-celebrations ( Photo-wikimedia commons)

Amaravati, May 26: గత ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై టీటీడీ బోర్డు (TTD Board) తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం GO No.888ని విడుదల చేసింది. 2016లో టీటీడీకి చెందిన 50 ఆస్తులు (TTD Immovable Properties) విక్రయించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Govt) నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి బోర్డు నిర్ణయాన్ని తాజా బోర్డుకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ప్రయాణికులతో రద్దీగా మారిన గన్నవరం,విశాఖపట్నం విమానాశ్రయాలు, ప్రయాణికులు రెండు గంటల ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి

ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో ( YV Subba reddy) మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ నిర్ణయాలు ఏవైనా స్వామీజీలు, ధార్మిక సంస్థలతో చర్చించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.

కాగా గత ప్రభుత్వ కాలంలో 2016 జనవరి 1 న టిటిడి బోర్డు 2016 న దీనికి సంబంధించి జీవో విడుదల చేసింది. నాటి టీటీడీ బోర్డు నిరర్థక ఆస్తుల విక్రయం నిర్ణయం అప్పటి పాలకమండలి చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి ఉన్న సమయంలో జరిగింది. బోర్డు సభ్యులుగా ఉన్న బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రామోజీరావు బంధువు సుచరిత.. మరో ఇద్దరితో టీటీడీ ఆస్తుల విక్రయానికి సబ్‌కమిటీ ఏర్పాటైంది. దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు కూడా ఆస్తుల విక్రయానికి సంబంధించి మౌనం వహించారు. మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి

ఇదిలాఉండగా.. టీటీడీ గత బోర్డు నిర్ణయాన్ని ప్రస్తుత బోర్డుకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా ప్రతిపక్షాలు ఈ విషయమై రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. కాగా టీటీడీకి సంబంధించి ఆంధ్రలో 26, తమిళనాడులలో 23 రిషికేశ్‌లో ఒకటి చొప్పున ఆస్తులు ఉన్నాయని ఆయన చెప్పారు. వీటి అమ్మకం ద్వారా టీటీడీకి రూ .24 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆశించారు.

ఏపీ రాజకీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) యొక్క ధర్మకర్తల మండలి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. 30.01.2016 నాటి తీర్మానం నెం .253 ద్వారా టిటిడి యొక్క 50 ఆస్తుల అమ్మకాలను నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం కొత్త జీవో తీసుకువచ్చింది. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఆస్తుల అమ్మకం టిటిడి ఉపయోగించుకోవచ్చో లేదో తెలుసుకోవడానికి మత పెద్దలు, అభిప్రాయ నిర్ణేతలు, భక్తుల విభాగం వంటి వివిధ వాటాదారులతో సంప్రదించి సమస్యను పున -పరిశీలించాలని ప్రభుత్వం దీని ద్వారా టిటిడిని ఆదేశించామని తెలిపారు.



సంబంధిత వార్తలు