Corona Medical Fee in AP: ఆరోగ్యశ్రీ ఉంటే కరోనా సేవలు ఉచితం, మందుల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, ఏపీలో ప్రైవేట్ అస్పత్రులకు కోవిడ్-19 ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం

ప్రస్తుతం కొన్ని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోనూ ప్రభుత్వపరంగా కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతోంది. వైద్యం, మందుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండటంతో ఇక్కడ కూడా రోగులకు ఉచితంగా సేవలందుతున్నాయి. డబ్బు చెల్లించి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్న వారికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ( private hospitals) కరోనాకు చికిత్స పొందేందుకు వీలు కల్పిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు.

Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, July 9: కోవిడ్‌-19 బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందుతుండగా ఇకపై ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వైద్యానికి అనుమతించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోనూ ప్రభుత్వపరంగా కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతోంది. వైద్యం, మందుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండటంతో ఇక్కడ కూడా రోగులకు ఉచితంగా సేవలందుతున్నాయి. డబ్బు చెల్లించి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్న వారికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ( private hospitals) కరోనాకు చికిత్స పొందేందుకు వీలు కల్పిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. భారత్‌లో రోజుకు 2.87లక్షల కొత్తకేసులు నమోదవుతాయంటున్న అధ్యయనం, మహారాష్ట్రలో మొత్తం 5,713 మంది పోలీసులకు కరోనా, దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24,879 కోవిడ్-19 కేసులు

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సకు నిర్దేశించిన మేరకే ఫీజులు (Corona Medical Fee in AP) తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే చికిత్స ఖర్చును ప్రభుత్వమే (Government Of Andhra Pradesh) చెల్లిస్తుంది. దీనిపై ప్రభుత్వం జవహర్‌రెడ్డి (Dr. K.S. Jawahar Reddy) అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మద్యం అక్రమంగా తరలిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు, 5 నుంచి 8 ఏళ్ళ వరకు జైలు శిక్ష, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి బుధవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే మరికొన్ని కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది.

ఫీజు వివరాలు

నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి 3,250 రూపాయలుగా నిర్ధారించింది.

క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్‌ఐవీ లేకుండా ఉంచితే రోజుకి 5,480 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.

ఎన్‌ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5,980 ఛార్జ్‌ చేయనున్నారు.

వెంటిలేటర్‌ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి 9,580గా నిర్ధారించారు.

ఇన్ఫెక్షన్‌ ఉన్న వారికి వెంటిలేటర్‌ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280గా ఉండనుంది.

ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 ఫీజు వసూలు చేయనున్నారు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులన్నీ ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం నుంచి లభించేవి

ప్రభుత్వ ఆధ్వర్యంలో డిసిగ్నేటెడ్‌ ఆస్పత్రుల్లో (ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలు) ప్రతి కోవిడ్‌ పేషెంటుకూ ఉచితంగానే వైద్యం అందుతుంది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కోవిడ్‌ సేవలు అందుతాయి.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ జాబితాలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో బీపీఎల్‌ కుటుంబాలు, లేదా ఏపీఎల్‌ (ఎబో పావర్టీ లైన్‌)లో ఉన్న వారికి ఉచితంగా సేవలు అందిస్తారు. వీరికి వైద్యమందించినందుకు నిర్దేశించిన రేట్ల ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఆరోగ్యశ్రీ పరిధిలో లేని ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఎవరైనా వెళ్లి వైద్యం చేయించుకోవాలనుకుంటే వారికి ప్రభుత్వం చెల్లించదు. వైద్యం పొందిన వారే చెల్లించాలి. అలాంటి ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ జాబితాలో చేరదలిస్తే ఆయా జిల్లాల కలెక్టర్లు అదేరోజు అనుమతులు మంజూరు చేయవచ్చు

కోవిడ్‌ సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు కనీసం 70 పడకల కంటే ఎక్కువ కలిగి ఉండాలి. పేషెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. రోగులకు శస్త్రచికిత్స, ప్రసవం లాంటి పరిస్థితుల్లో ఆర్టీపీసీఆర్‌ లేకుండా తక్షణమే వైద్యం చేయాలి. ఆ తర్వాత పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలితే అధికార వర్గాలకు తెలియజేయాలి.

ప్రైవేట్‌ ఆస్పత్రుల నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే. ఈ ప్రక్రియ నిర్వహణకు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆధ్వర్యంలో వెబ్‌పోర్టల్‌ పనిచేస్తుంది.