AP Govt Signs MoU with Amul: ఏపీలో మహిళలకు మంచి రోజులు, అమూల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం, దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని తెలిపిన ఏపీ సీఎం
ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (AP Govt Signs MoU with Amul) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్‌హెడ్ రాజన్ సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్‌తో సీఎం మాట్లాడారు.
Amaravati, July 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (AP Govt Signs MoU with Amul) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్ చెన్నై జోనల్‌హెడ్ రాజన్ సంతకాలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్‌తో సీఎం మాట్లాడారు. కొత్త మంత్రి పదవులు ఆ ఇద్దరికేనా? రేపే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ మహిళల జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగు అన్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా కింద మహిళలకు రూ.11వేల కోట్లు సాయం చేశాం. నాలుగేళ్లపాటు వారికి సహాయం అందుతుంది. ఈ ప్రభుత్వ సహాయం మహిళల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకార డెయిరీలకు ( Dairy industry) మంచి రోజులు వచ్చాయని, దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Here's AP CMO Tweet
ఒప్పందం ద్వారా జరిగే ప్రయోజనాలు
ఈ ఒప్పందంవల్ల పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది.
వైఎస్సార్ చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి రూ.11వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. వీరు మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా పాడి పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రొత్సహించాలి. ఆ పరిశ్రమల్లో మహిళలకున్న అవకాశాలను పరిశీలించి వారిని ముందుకు నడిపించాలి.