AP IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఒకేసారి 56 మందికి స్థాన చలనం.. జాబితాలో 8 జిల్లాల కలెక్టర్లు కూడా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది జిల్లాల కలెక్టర్లు సహా 56 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం అర్ధ రాత్రి ఉత్తర్వులు (జీవో 635) జారీ చేశారు.

Credits: Twitter

Vijayawada, April 7: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని జగన్ (Jagan) ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌ అధికారులకు (IAS Officers) స్థాన చలనం (Transfers) కల్పించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది జిల్లాల కలెక్టర్లు (Collectors) సహా 56 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం అర్ధ రాత్రి ఉత్తర్వులు (జీవో 635) జారీ చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతుండగా.. ఒకేసారి ఇంత మంది అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే వేసవిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

SSC Paper Leak Case: టెన్త్ పేప‌ర్ లీకేజీ కేసు, ఈటెలకు నోటీసులు జారీ, ఈ నెల 11న వ‌రంగ‌ల్ డీసీపీ ఆఫీసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు

ఎవరెవరు ఎక్కడికి?

బండి సంజయ్ ఫోన్లో కీలక వివరాలు, ఫోన్ ఇవ్వని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రిమాండ్‌ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు, కేసు వివరాలను వెల్లడించిన వరంగల్ సీపీ రంగనాథ్‌