Credits: Video Grab

Hyd, April 6: తెలంగాణలో సంచలనం రేపిన టెన్త్ పేప‌ర్ లీకేజీ( tenth Paper Leak ) కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌( Etala Rajender )కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌రంగ‌ల్ డీసీపీ ఆఫీసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే శామీర్‌పేట‌లోని ఈట‌ల రాజేంద‌ర్ నివాసానికి క‌మ‌లాపూర్ పీఎస్ ఎస్ఐ నేరుగా వెళ్లి నోటీసులు అంద‌జేశారు. పోలీసుల నోటీసుపై న్యాయసలహా తీసుకునే యోచనలో ఈటల ఉన్నారు.

బండి సంజయ్‌కి 14 రోజులు రిమాండ్, చొక్కా విప్పి తన ఒంటిపై గాయాలను చూపించిన బీజేపీ ఎంపీ, టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా సంజయ్

ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని వరంగల్ సీపీ రంగనాథ్‌ తెలిపారు.కాగా ప‌దో త‌ర‌గ‌తి హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం( Hindi Question Paper ) లీకేజీకి సంబంధించిన రిమాండ్ రిపోర్టులో బండి సంజ‌య్‌( Bandi Sanjay )ను ఏ1గా, బూర ప్ర‌శాంత్‌ను ఏ2గా చేర్చిన సంగ‌తి తెలిసిందే.

బండి సంజయ్ ఫోన్లో కీలక వివరాలు, ఫోన్ ఇవ్వని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రిమాండ్‌ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు, కేసు వివరాలను వెల్లడించిన వరంగల్ సీపీ రంగనాథ్‌

అయితే ఏ2 ప్ర‌శాంత్.. బండి సంజ‌య్‌తో పాటు ఈట‌ల రాజేంద‌ర్‌కు, ఆయ‌న ఇద్ద‌రు పీఏలు రాజు, న‌రేంద‌ర్‌కు కూడా హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం వాట్సాప్ ద్వారా పంపాడు. దీంతో వారి పేర్ల‌ను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఈట‌ల రాజేంద‌ర్‌కు నోటీసులు జారీ చేశారు. ఈట‌ల రాజేంద‌ర్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు న‌మోదు చేయ‌నున్నారు.

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ‌లాపూర్ నుంచి హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం లీకైన సంగ‌తి తెలిసిందే. క‌మ‌లాపూర్ బాయ్స్ స్కూల్ నుంచి తెలుగు బిట్ పేప‌ర్, హిందీ ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ కావ‌డంతో.. ఆ స్కూల్‌నే ఎందుకు ఎంచుకున్నార‌న్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.