IPL Auction 2025 Live

Covid in AP: ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు నమోదు, బోధనాసుపత్రుల్లో కోవిడ్, నాన్‌కోవిడ్‌ సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైద్య విద్యా డైరెక్టర్‌, ఏలూరు ఆస్పత్రిలో రోగి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని

ఇక వైరస్ తో 24 గంటల్లో 33 మంది (Covid Deaths) మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,79,872కి (Coronavirus) చేరగా, కరోనాతో 12,599 మంది మరణించారు. అలాగే 44,733 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,22,500 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 95,327 కరోనా టెస్టులు నిర్వహించారు.

covid (Photo-PTI)

Amaravati, June 27: ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక వైరస్ తో 24 గంటల్లో 33 మంది (Covid Deaths) మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,79,872కి (Coronavirus) చేరగా, కరోనాతో 12,599 మంది మరణించారు. అలాగే 44,733 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,22,500 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 95,327 కరోనా టెస్టులు నిర్వహించారు. అలాగే 24 గంటల్లో 5,570 మంది రికవరీ అయ్యారు. కృష్ణా జిల్లాలో 8 మంది, చిత్తూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరి చొప్పున మృతి చెందారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మార్చి నెల నుంచి అన్ని బోధనాసుపత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా (Covid Hospitals) మార్చిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆస్పత్రుల్లో ఇక నాన్‌కోవిడ్‌ సేవలనూ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆస్పత్రులకు కరోనాతోనే కాకుండా పలు ఆరోగ్య సమస్యలతో వచ్చే వారు ఎక్కువ మంది ఉంటున్న నేపథ్యంలో ప్రతి బోధనాసుపత్రిలో కోవిడ్, నాన్‌ కోవిడ్‌ విభాగాలను ఏర్పాటు చేయాలని వైద్య విద్యా డైరెక్టర్‌ శనివారం ఆదేశాలిచ్చారు.

దేశంలో పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, 24 గంట‌ల్లో 57,944 మంది కోలుకుని ఇంటికి, తాజాగా 50,040 క‌రోనా కేసులు న‌మోదు, డిసెంబర్‌ 31 కల్లా 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు

కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరే వారికి ప్రత్యేక పడకలు, రూములు కేటాయించి, మిగతా వాటిని నాన్‌కోవిడ్‌కు ఉపయోగించాలని సూచించారు. కోవిడ్‌ బాధితులకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి మిగతా ప్రాంతాన్ని నాన్‌కోవిడ్‌ సేవలకు వాడుకోవాలని పేర్కొన్నారు. యాక్సిడెంట్‌ కేసులు, ఈఎన్‌టీ, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలతో వచ్చేవారికి ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్‌ సేవలను పునరుద్ధరించాలని ఆదేశించారు. కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే ఆస్పత్రుల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే, నాన్‌ కోవిడ్‌ సేవలనూ కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో బోధనాసుపత్రులకు ప్రసవాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో గర్భిణులకు ప్రత్యేక వార్డులు కేటాయించాలని ఆదేశించారు. కోవిడ్, నాన్‌కోవిడ్‌ సేవలను రెండింటినీ ఒకే ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం వల్ల రోగులకు ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.

డేంజర్‌గా మారిన డెల్టా వేరియంట్‌, ధర్డ్ వేవ్ ముప్పుతో 85 దేశాల్లో హైఅలర్ట్, మరోసారి కఠిన ఆంక్షలు విధించుకుంటున్న మెజార్టీ దేశాలు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌, ఇండియాలో పెరుగుతున్న డెల్టా ప్లస్ కేసులు

ఇక ఏలూరు ఆస్పత్రిలో రోగి మృతిపై మంత్రి ఆళ్ల నాని విచారణకు ఆదేశించారు. డీఎం,హెచ్‌వో, ఆశ్రమం హాస్పిటల్‌ డాక్టర్‌తో మాట్లాడారు. పేషెంట్ ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. మృతుడి బంధువుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన ఓ వ్యక్తి ఏలూరు ఆశ్రమం హాస్పిటల్‌ చేరాడు. దాదాపు నెల రోజుల పాటు చికిత్స తీసుకుని మృతి చెందాడు.