APSRTC: ఇకపై బస్సులోనే టికెట్లు, గ్రౌండ్‌ బుకింగ్‌కు పుల్ స్టాప్ పెట్టే యోచనలో ఏపీఎస్ఆర్టీసీ, గ్రౌండ్‌ లెవల్ బుకింగ్ ద్వారా కలెక్షన్‌ బాగా తగ్గిపోవడమే ప్రధాన కారణం

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడిపింది. మే 21 నుంచి గ్రౌండ్‌ బుకింగ్‌ ద్వారా ప్రయాణీకులను బస్సు ఎక్కించి వారి గమ్యాలకు చేర్చే ప్రక్రియను చేపట్టారు. అయితే గ్రౌండ్‌ బుకింగ్‌ ప్రక్రియ ద్వారా కలెక్షన్‌ బాగా తగ్గిపోయింది. ఈ ప్రక్రియ ద్వారా బస్సులు సకాలంలో నడిపించలేకపోతున్నారు. బస్సులలో ప్రయాణీకులు ఆయా బస్టాండు కేంద్రాల నుంచి టికెట్స్‌ ఇచ్చి ఎక్కించడం వల్ల బస్సులు రాకపోకలు తీవ్రమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. గంటకు చేరాల్సిన బస్సు ఒకటిన్నర గంటకుపైగా సమయం పడుతోంది.

APSRTC to stops all 168 services to Karnataka from tomorrow amid Bengaluru going under complete lockdown (Photo-ANI)

Amaravari, July 16: ఆర్టీసీలో ఇప్పటిదాకా కొనసాగిస్తున్న గ్రౌండ్‌ బుకింగ్‌కు బ్రేక్‌ పడబోతోంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడిపింది. మే 21 నుంచి గ్రౌండ్‌ బుకింగ్‌ ద్వారా ప్రయాణీకులను బస్సు ఎక్కించి వారి గమ్యాలకు చేర్చే ప్రక్రియను చేపట్టారు. అయితే గ్రౌండ్‌ బుకింగ్‌ ప్రక్రియ ద్వారా కలెక్షన్‌ బాగా తగ్గిపోయింది. ఈ ప్రక్రియ ద్వారా బస్సులు సకాలంలో నడిపించలేకపోతున్నారు. ఆ డబ్బు నాదైతే ఎంక్వయిరీ వేయించండి, వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ రంగు పులుముకున్న రూ. ఐదు కోట్ల వ్యవహారం

బస్సులలో ప్రయాణీకులు ఆయా బస్టాండు కేంద్రాల నుంచి టికెట్స్‌ ఇచ్చి ఎక్కించడం వల్ల బస్సులు రాకపోకలు తీవ్రమైన ఆలస్యంతో నడుస్తున్నాయి. గంటకు చేరాల్సిన బస్సు ఒకటిన్నర గంటకుపైగా సమయం పడుతోంది. ప్రయాణీకులు బస్సుల ద్వారా ప్రయాణం చేయడం బాగా తగ్గిపోయింది. దీని వల్ల ఆర్టీసీకి నష్టం కలుగుతోంది. దీంతో ఈ విధానానికి స్వస్తి పలికేందుకు ఆర్టీసీ నిర్ణయించుకుంది. అంతేగాకుండా పల్లెలకు బస్సులు తిప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని డిపోల నుంచి కండక్టర్లు బస్సు ఎక్కనున్నారు. బస్సులోనే కండక్టర్‌ ఉంటే సకాలంలో బస్సులు నడుస్తాయి. అంతేగాకుండా టికెట్‌ జారీ విషయంలో జాప్యం జరగదు. ప్రయాణీకులు కూడా బస్సులను ఆశ్రయించేందుకు వీలవుతుంది.

ఇంతులో భాగంగానే ముందుగా కడప రాజంపేట డిపోలో బుధవారం నుంచి కండక్టర్లకు డ్యూటీలను ఆర్టీసీ అధికారులు వేశారు. కండక్టర్లు బస్సులోనే విధులు నిర్వహించేలా ఆర్టీసీ ఆదేశించిందని,ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని ఎంప్లాయిస్‌ యూనియన్‌ స్టేట్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జీవీనరసయ్య ఓ పత్రికకు తెలిపారు.

బదిలీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : మాదిరెడ్డి ప్రతాప్‌

ఇదిలా ఉంటే ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన మాదిరెడ్డి ప్రతాప్‌కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ నెల 13న ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై విమర్శలకు ఏడు రోజుల్లో కారణాలు తెలపాలని ఆదేశించింది.. సమాధానం ఇవ్వకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా మాదిరెడ్డి ప్రతాప్‌‌ను ఆదేశించారు.

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ను ప్రభుత్వం ఇదివరకే బదిలీ చేసి అతని స్థానంలో రవాణాశాఖ కార్యదర్శి కృష్ణబాబుకి ఆర్టీసీ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ తర్వాత ఈ నెల 13న ప్రతాప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్ లేకపోవడం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైందని.. సీఎం కొడుకు పొలిటికల్ ఇంట్రస్ట్ వల్లే జైల్లో పెట్టారన్నారు. వైఎస్ హయాంలో ఐదేళ్ల పాటూ ఐటీ కార్యదర్శిగా పనిచేశానని.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కొందరు అధికారుల్ని బదిలీ చేసిన ఫైల్స్‌పై విచారణ జరిపింది అన్నారు. తనను మాత్రం విచారించలేదని.. అది తన ఇంటిగ్రిటీ అన్నారు. తన బదిలీని ప్రభుత్వ విజ్ఞత వదిలేస్తున్నాను అన్నారు. అనేక కారణాలతో తన బదిలీ జరిగి ఉండొచ్చని.. తన బదిలీ నిర్ణయాన్ని స్వాగతిస్తాను అన్నారు.



సంబంధిత వార్తలు

TTD Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌.. రేపు ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల.. 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు

Pushpa 2 Ticket Price Hike: 'పుష్ప‌2' టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్రభుత్వం ఉత్త‌ర్వులు.. బెనిఫిట్ షోలు కూడా.. సీఎం, డిప్యూటీ సీఎంల‌కు అల్లు అర్జున్‌ కృత‌జ్ఞ‌త‌లు.. పెరిగిన టికెట్ రేట్లు ఎంతంటే??

Pushpa 2 Tickets Price: పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు, డిసెంబర్ 5 నుంచి రోజు ఏడు ఆటలు, బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా?

Pushpa 2 New Record: పుష్ప-2 ఖాతాలో మరో రికార్డు, అమెరికాలో ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే 15 వేల టికెట్లు హాట్ సేల్, ఇంత వేగంగా బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి