APSRTC: నేటి నుంచి కర్ణాటకకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్, ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభం, apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం

ఈ నెల 17 నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు (APSRTC buses to Karnataka) నడవనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నిర్ణయించింది. ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభించి అనంతరం నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు (Karnataka) బస్సులు నడపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

APSRTC | Photo: Twitter

Amaravati, June 15: అంతర్రాష్ట​ బస్సు సర్వీసులను నడిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) రెడీ అయింది. ఈ నెల 17 నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు (APSRTC buses to Karnataka) నడవనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) నిర్ణయించింది. ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభించి అనంతరం నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు (Karnataka) బస్సులు నడపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. గత 24 గంటల్లో 325 మంది మృతి, దేశ వ్యాప్తంగా 3,32,424కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నవంబర్‌ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్న ఐసీఎంఆర్‌

నేటి నుంచి ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లను ప్రారంభించనుంది. apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించింది. బస్సుల్లో భౌతిక దూరం, విధిగా మాస్కులు, శానిటైజర్‌ వాడకం తప్పనిసరి. దీంతో పాటుగా కర్ణాటక నుంచి ఏపీ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ప్రొటోకాల్‌ పాటించాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు, రేపు రానున్న ఫలితం, ఇద్దర్నీ కడప సెంట్రల్‌ జైలుకు తరలించిన అధికారులు, ఫోర్జరీ సంతకాలతో స్కామ్ చేశారని ఆరోపణలు

లాక్‌డౌన్‌ కారణంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేసిన విషయం విదితమే. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు.