BRS Focuses on AP: ఆంధ్రప్రదేశ్‌లోనూ బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌, జనవరి చివరినాటికి విజయవాడలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్, భారీ బహిరంగ సభకు ప్లాన్

వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు, దీని కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

KCR to inaugurate BRS office in New Delhi

Amarawathi, DEC 24: జాతీయ రాజకీయాల్లో దూసుకుపోయేందుకు సర్వంసిద్ధం చేసుకుంటున్నారు సీఎం కేసీఆర్ (CM KCR). ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ (BRS) జాతీయ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్...త్వరలోనే మిగిలిన రాష్ట్రాల్లోనూ పాగా వేయాలని చూస్తోంది. ఇందుకోసం పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ చురుగ్గా పావులు (BRS in AP) కదుపుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు, దీని కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

BRS Office in Delhi: ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రారంభోత్సవానికి హాజరైన జాతీయ నేతలు 

ఆయన ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ ఉంటుందని, జనవరి చివరలో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుందని వెల్లడించాయి. అమరావతిలో పార్టీ భనవ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన బీఆర్ఎస్.. తాత్కాలిక కార్యాలయం నుంచే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 26 లేదా 27న ఏపీకి చెందిన కొందరు నేతలు కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు