ఢిల్లీలోని సర్ధార్ పటేల్ మార్గ్‌లో బీఆర్‌ఎస్ ఆఫీస్ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు CM KCR. జెండా ఆవిష్కరించి బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కేసీఆర్ వెంట కర్ణాటక, యూపీ మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్‌లు ఉన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చాయి.
జాతీయ రాజకీయాల్లో తన ముద్రను వేసేందుకు టీఆర్‌ఎస్ కాస్తా బీఆర్‌ఎస్‌గా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలను పార్టీ ఆహ్వానించారు. కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్‌లతో పాటు మరికొందరు నేతలను ఆహ్వానించారు. వీరితో పాటు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.
Here's TRS Party Tweet
Live : CM Sri K. Chandrashekhar Rao inaugurating Bharat Rashtra Samithi (BRS) office in New Delhi. https://t.co/CTJ0EYzxxi
— TRS Party (@trspartyonline) December 14, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)