Police Case on Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ పై మధురైలో కేసు నమోదు.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై తమిళనాడులోని మధురైలో ఓ కేసు నమోదైంది. వంజినాథన్ అనే న్యాయవాది ఈ మేరకు మధురై కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు.

Udhayanidhi Stalin says 'Wait and see' after Pawan Kalyan took jibe at his remark on Sanatan Dharma

Vijayawada, Oct 5: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పై తమిళనాడులోని (Tamilnadu) మధురైలో ఓ కేసు నమోదైంది. వంజినాథన్ అనే న్యాయవాది ఈ మేరకు మధురై కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి స్టాలిన్‌ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ వివాదానికి, ఉదయనిధికి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో పవన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి

అసలేం జరిగిందంటే?

గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. దీనిని ఎవరూ నిర్మూలించలేరని, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారని వ్యాఖ్యానించారు. అయితే, పవన్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించే ఈ హెచ్చరిక చేశారన్న వార్తలొచ్చాయి. దీనికి కారణం లేకపోలేదు.  ఉదయనిధి స్టాలిన్ గతంలో ఒకసారి మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే పవన్ ఆయన్ని టార్గెట్ చేస్తూ పైవ్యాఖ్యలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.

చార్మినార్‌ పై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌ల్‌ చ‌ల్‌.. ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు (వీడియో)

స్పందించిన ఉదయనిధి

పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి కూడా స్పందించారు. పవన్ కామెంట్స్‌ పై మీ స్పందనేంటన్న ప్రశ్నకు ‘వెయిట్ అండ్ సీ’ అని బదులిచ్చారు.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Kishan Reddy Comments on Union Budget: కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఇది రాష్ట్ర బడ్జెట్‌ కాదంటూ మండిపాటు

Union Budget 2025: ఆకట్టుకుంటున్న నిర్మలమ్మ 'బడ్జెట్ సైకత శిల్పం'.. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో పూరీ తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించిన సుదర్శన్‌ పట్నాయక్‌

Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Bengaluru Horror: దారుణం, మదర్సాలో బాలుడిపై టీచర్ పదే పదే అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు, చివరకు తల్లిదండ్రులకు ఘోరాన్ని చెప్పిన బాలుడు

Share Now