Nimmagadda Meeting with BJP Leaders: మీటింగ్ మతలబు అదేనా?, బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోటల్లో రహస్య భేటీ, సుప్రీంకోర్టులో విచారణలో నిమ్మగడ్డ తొలగింపు అంశం
రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో (Kamineni Srinivasa Rao) రమేష్ కుమార్ ఇటీవల ఓ హోటల్లో భేటీ కావడం (Nimmagadda Meeting with BJP Leaders) సంచలనం సృష్టిస్తోంది.హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగినట్టుగా సీసీటీవీ పుటేజీ (CCTV Footage) బయటకు వచ్చింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగినట్లుగా ఆ సీసీ టీవీ పుటేజీలో తెలుస్తోంది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Amaravati, June 23: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో (Kamineni Srinivasa Rao) రమేష్ కుమార్ ఇటీవల ఓ హోటల్లో భేటీ కావడం (Nimmagadda Meeting with BJP Leaders) సంచలనం సృష్టిస్తోంది. ఏపీలో అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్లాలి, పేషెంట్లకు అక్కడే మందులు ఇవ్వాలి, అధికారులకు ఆదేశాలు జారీచేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగినట్టుగా సీసీటీవీ పుటేజీ (CCTV Footage) బయటకు వచ్చింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగినట్లుగా ఆ సీసీ టీవీ పుటేజీలో తెలుస్తోంది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Here's CCTV Footage Video
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేస్తోన్న తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) అర్ధాంతరంగా, పదవీ కాలం ముగియకముందే ఉద్వాసన పలకడానికి నిరసనగా ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో (AP High court) న్యాయపోరాటం చేశారు. ఈ విషయంలో హైకోర్టు నుంచి వెలువడిన తీర్పు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అనుకూలంగా వెలువడింది. జగన్ సర్కారుకు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఆయనను ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించినా ఫలితం రాలేదు. స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టఅంగీకరించలేదు.కాగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో (Supreme court) ఇంకా విచారణ కొనసాగుతోంది. నిమ్మగడ్డ వ్యవహారంలో ఊహించని ట్విస్టు, ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగం శ్రీకాంత్‌రెడ్డి
ఈ సమయంలో బీజేపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం హైకోర్టులో విచారణ దశలో ఉన్న సమయంలో సుజనా చౌదరి (Sujana Chowdary) ఓ సంచలన ప్రకటన చేశారు. ఆయన కోసం తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నానని, అవి ఫలిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ సర్కారు
అమరావతి ప్రాంతం నుంచి రాజధాని తరలి వెళ్లకుండా తాను కొన్ని ప్రయత్నాలు చేశానని, అవి ఫలించాయని, అదే తరహాలో నిమ్మగడ్డ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. నిమ్మగడ్డను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేసిన వారిలో కామినేని శ్రీనివాస్ ఒకరు. ప్రస్తుతం ఆ ఇద్దరూ నిమ్మగడ్డను కలుసుకోవడం రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం, హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రెండు వారాల్లోగా ప్రతివాదులందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు
ఇక ఈ వీడియోపై అధికార వైసీపీ పార్టీ నేతలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానంటూ వాదనలు చేస్తున్న రమేష్‌కుమార్‌కు రాజకీయనేతలతో మంతనాలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ తీవ్ర ఆరోపణల వెనుక కుమ్మక్కు ఉందన్న తమ వాదనకు బలం ఇదేనని వారు చెబుతున్నారు.
కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో, ఇదే కేసులో పిల్ వేసిన వ్యక్తితో నిమ్మగడ్డ చర్చలు, వారి కుమ్మక్కును తెలియజేస్తున్నాయన్న వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నిమ్మగడ్డ నిష్పక్షపాత మనిషికాదని, పక్షపాత మనిషి అని వీడియో ఆధారాలతో రుజువయ్యిందని.. ప్రభుత్వంపై ఆరోపణలపై కుట్ర కూడా బయటపడిందన్న అధికారపార్టీ నేతలు చెబుతున్నారు.