AP SEC Row: హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ సర్కారు
Ramesh Kumar (Photo-Youtube Grab)

Amaravati,June 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సర్వీసు నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను, ఎన్నికల కమిషనర్‌గా (State Election Commissioner) హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జగన్ సర్కారుకు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు

ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి సోమవారం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (SLP) దాఖలు చేశారు. ఇందులో నిమ్మగడ్డ రమేశ్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి, జస్టిస్‌ వి.కనగరాజ్‌ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.

ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టులో వేసిన స్టే పిటిషన్‌ను జగన్ సర్కార్ ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంది. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ వివాదం, ఏపీ డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ, ఫోర్జరీ సంతకాలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి, లేఖ తానే రాశానంటూ రమేష్ కుమార్ వివరణ

ఈ పరిస్థితులు ఇలా ఉంటే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస రావు సుప్రీంకోర్టు (Supreme Court of India) గడప తొక్కారు. అత్యున్నత న్యాయస్థానంలో కేవియెట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్ పిటిషన్‌ దాఖలు చేయడంతో కేవియట్ పిటిషన్ వేసినట్టు ఆయన తెలిపారు. హైకమాండ్‌ అనుమతితోనే సుప్రీంలో పిటిషన్‌ వేశానని చెప్పారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలంటే మే 29న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ను తొలగిస్తూ తెచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుతం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారంటూ నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు భారీ షాక్, ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తూ కొత్త ఆర్డినెన్స్, నిబంధనలను సవరించిన ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి

అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేసినట్లు ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు. అప్పటి వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరామన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుందన్నారు.