AP Three Capitals Row: రాజధానితో మాకు సంబంధం లేదని తెలిపిన కేంద్రం, రిట్‌ పిటిషన్‌ 20622/2018కు ప్రతిగా ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ

రాజధాని అంశంపై (AP Three Capitals Row) ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ (Home Ministry) గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో (AP High Court) దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని (AP Capital) నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనువైన ప్రాంతంలో గానీ, అభివృద్ది చేయాలని భావించిన ప్రాంతం నుంచి గానీ పరిపాలన చేయవచ్చని చెప్పింది. ఈ అంశంపై పూర్తి అధికారాలు రాష్ట్రాల్లోని ప్రభుత్వానిదేనని చెప్పింది.

AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, August 6: ఏపీ రాజధాని అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అంశంపై (AP Three Capitals Row) ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ (Home Ministry) గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో (AP High Court) దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని (AP Capital) నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనువైన ప్రాంతంలో గానీ, అభివృద్ది చేయాలని భావించిన ప్రాంతం నుంచి గానీ పరిపాలన చేయవచ్చని చెప్పింది. ఈ అంశంపై పూర్తి అధికారాలు రాష్ట్రాల్లోని ప్రభుత్వానిదేనని చెప్పింది.

రిట్‌ పిటిషన్‌ 20622/2018కు ప్రతిగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 6 ప్రకారం 2014లో శివరామకృష్ణన్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ‘రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై శివరామకృష్ణన్‌ కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014న ఈ కమిటీ రాజధాని విషయమై నివేదిక సమర్పించింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఏపీలో అన్‌లాక్ 3.0 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ ప్రక్రియ, కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్

రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. జులై 31, 2020న ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఒక గెజిట్‌ను విడుదల చేసింది. గెజిట్‌ ప్రకారం ఏపీలో మూడు పాలనా కేంద్రాలుంటాయి. గెజిట్‌ ప్రకారం శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును పేర్కొన్నార’ని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది.

పునఃవిభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరువేరుస్తామని, స్పెషల్ కేటగిరీ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం (Modi government) తన అఫిడవిట్‌లో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులందిస్తున్నామని, ఇప్పటికే ఏపీకి రూ.1,400 కోట్లు ఇచ్చామని కేంద్రం తెలియజేసింది. మూడు రాజధానులపై హైకోర్టు స్టే, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఏపీ హైకోర్టు, ఆగస్టు 14కు విచారణ వాయిదా

హైకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా ఆమోదించలేకపోతోందంటూ తాను కౌంటర్‌లో పేర్కొన్న విషయాలను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) బీఎస్‌ భానుమతి బుధవారం హైకోర్టుకు నివేదించారు. విశ్రాంత న్యాయమూర్తి, ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వంగా ఈశ్వరయ్య గురించి పొందుపరిచిన విషయాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌కు సంబంధించి తాను దాఖలు చేసిన కౌంటర్‌లోని 13వ పేరా మొత్తాన్ని వెనక్కి తీసుకుంటానని తెలిపారు. అలా అయితే దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif