Amaravati, August 4: ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై (three separate capitals) రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయితే, కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆగస్టు 14వరకు యథాతధ స్థితి ఉండాలని స్పష్టం చేసింది. చంద్రబాబు 48 గంటల సవాల్, అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామంటూ పిలుపు, మీరు రాజీనామా చేసి వస్తే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని తెలిపిన పేర్ని నాని
బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల గడువు కోరారు. తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది.
పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.