Chandrababu on APPSC: డీజీపీగా ఉండి తప్పులు చేసిన గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించారు, జగన్ సర్కారుపై మండిపడిన చంద్రబాబు నాయుడు
ఏపీపీఎస్సీ (APPSC)లో జరిగిన అక్రమాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు (National President of Telugu Desam), మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vjy, Mar 15: ఏపీపీఎస్సీ (APPSC)లో జరిగిన అక్రమాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు (National President of Telugu Desam), మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ (DGP)గా తప్పుడు పనులు చేసిన గౌతమ్ సవాంగ్ (Gautham Sawang)ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా సీఎం జగన్ (CM Jagan) నియమించారని, ఏపీపీఎస్సీని వైసీపీ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు.
డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను తాను విమర్శిస్తే.. అక్కడి నుంచి తప్పించి ఏపీపీఎస్సీ ఛైర్మనుగా నియమించారన్నారు. సలాం బాబు, సుధాకర్ రెడ్డి, సుధీర్ వంటి వైసీపీ నేతలను ఏపీపీఎస్సీలో సభ్యులుగా చేర్చారని, చెత్త మెంబర్లను నియమించి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. 2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు, ఉద్యోగులు ఆందోళన చెందవద్దని తెలిపిన ఏపీ ప్రభుత్వం
జగన్ ప్రభుత్వం (Jagan Govt.) యువతను దగా చేసిందని, ఏపీపీస్సీలో అక్రమాలు చేసి యువత గొంతు నులిమేశారని, కృూర మృగాల మాదిరి పిల్లల జీవితాలను నాశనం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీపీఎస్సీ ద్వారా రాష్ట్రంలో కీలక పోస్టులను భర్తీ చేస్తారని, వివిధ కీలక శాఖల్లో కీలక పోస్టుల్లో ఏపీపీఎస్సీని ఎంపిక చేస్తారన్నారు.
ఐటీలో కోట్లాది రూపాయలు జీతాలొచ్చే అవకాశం ఉన్నా.. ప్రజలకు సేవ చేయడం కోసం గ్రూప్ పరీక్షలు రాస్తారన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకంలో కాంప్రమైజ్ ఉండకూడదని, టీడీపీ హయాంలో ఉదయ్ భాస్కర్ (Uday Bhaskar)ను నియమించామని చెప్పారు.ఛైర్మన్‌గా నిక్కచ్చిగా వ్యవహరించిన ఉదయ్‌భాస్కర్‌ను మెడపట్టి బయటకు పంపారు. జగన్‌కు అనుకూలంగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్‌ను నియమించారని మండిపడ్డారు.
2018లో జరిగిన గ్రూప్-1 పరీక్షల వాల్యూయేషన్లో అక్రమాలకు పాల్పడ్డారని, డిజిటల్ వాల్యూయేషన్.. మాన్యువల్ వాల్యూయేషన్ అంటూ రకరకాలుగా వాల్యూయేషన్ చేశారని విమర్శించారు.అక్రమాలు చేసిన వాళ్లని జైళ్లల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఓసారి వాల్యూయేషన్ అయ్యాక రెండోసారి ఎలా చేస్తారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సీతారామాంజనేయులే రెండో సారి వాల్యూయేషన్ జరపాలని లేఖ రాశారు... పైగా రెండోసారి వాల్యూయేషన్ చేయలేదని కోర్టులకు చెప్పారన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి కోర్టులంటే కూడా భయం లేదని, ఏపీపీఎస్సీ పోస్టులను అమ్ముకున్నారని, తాడేపల్లి ప్యాలెస్సులో ఇచ్చిన లిస్టులో ఉన్న వారికి పోస్టింగులు వచ్చేలా చేశారని, ఈ మేరకు మూడోసారి వాల్యూయేషన్ చేశారన్నారు. అఖిల భారత సర్వీసెస్‌లో ఉండడానికి అనర్హుడని, ఆ సైకో ఎవర్ని చంపమన్నా.. ఈ దుర్మార్గులు చంపేస్తారన్నారు. గ్రూప్-1 అభ్యర్థులు చందాలు వేసుకుని న్యాయం కోసం పోరాడారని.. ఐదేళ్ల తర్వాత వాళ్లకు న్యాయం జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.