2018 Group-1 Mains Cancellation: 2018 గ్రూప్‌-1 మెయిన్స్​ రద్దు చేసిన హైకోర్టు, ఉద్యోగులు ఆందోళన చెందవద్దని తెలిపిన ఏపీ ప్రభుత్వం
Credits: Wikimedia Commons

Vjy, Mar 13: 2018లో ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు (AP High Court) కీలక తీర్పు వెలువరించింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి, రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది.  ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు, రామచంద్రయ్య, వంశీ కృష్ణయాదవ్‌పై వేటు వేసిన శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు

మెయిన్స్‌ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తిచేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై గ్రూప్‌ వన్‌ ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో.. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది.