CPI Narayana on CM Jagan: జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు, జగన్, మోదీ ఇద్దరిది రహస్య బంధమంటూ మండిపడిన సీపీఐ నారాయణ

మోదీని ఓడించండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అలాగే ఏపీలో ‘మోదీ, జగన్ హటావో’ అంటూ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు

Narayana (File: CPI Site)

Amaravati, May 9: ఈ రోజు మీడియాతో సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించండి.. మోదీని ఓడించండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. అలాగే ఏపీలో ‘మోదీ, జగన్ హటావో’ అంటూ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. జగన్, మోదీ ఇద్దరూ రహస్య బంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. జగన్ చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకేలా ఉంటాయని ఆరోపించారు. జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు ఉన్నారన్నారు. రాజన్న పేరు చెప్పి ఆయనకే జగన్ మూడు నామాలు పెడుతున్నారని మండిపడ్డారు.

‘‘బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావు. బంకర్లలో కూర్చుని ‘జగనన్నకు చెప్పండి’ అంటే ఎలా చెప్పగలరు?’’ అని నారాయణ ప్రశ్నించారు. ఏపీలో అడుగడుగునా మోదీకి సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకు బీజేపీ గండి కొడుతున్నా మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. మోదీ, జగన్ ఇద్దరూ కవల పిల్లలన్నారు.

జగన్ తప్పుకుంటే రైతులకు న్యాయం ఎలా చేయాలో చంద్రబాబు చేసి చూపిస్తారు, తక్షణమే సీఎం కుర్చీనుంచి జగన్ దిగిపోవాలని కన్నా డిమాండ్

బీజేపీతో సయోధ్య ఉన్న పార్టీలతో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వాలు కొంటామంటే ఇవ్వబోమంటున్నారని.. కేవలం ప్రైవేట్ వాళ్లకే ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అదానీ కృత్రిమంగా సృష్టించిన ఆర్థిక వ్యవస్థను అమెరికా సంస్థ గుర్తించి బయటకు తెచ్చింది. ప్రధాని మోదీ సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగారు. మోదీకి 30 మంది దత్త పుత్రులు ఉన్నారు.. వాళ్లే దేశాన్ని దోచుకుంటున్నారు’’ అని నారాయణ అన్నారు.

జగనన్నకు చెబుదాం లాంచ్ చేసిన సీఎం జగన్, మీ సమస్యను 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఎలా చెప్పాలో తెలుసుకోండి

కర్ణాటకలో గెలుపు కోసం మోదీ మతాల మధ్య చిచ్చుపెడుతూ అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. అదానీ, మోదీ బంధాన్ని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేయించి అనర్హత వేటుకు గురయ్యేలా చేశారన్నారు.



సంబంధిత వార్తలు

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif