Odisha Triple Train Crash: ఒడిశా రైలు ప్రమాదం, ఇంకా తెలియని 28 మంది ఏపీ వాసుల ఆచూకి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున అందించాలన్నారు.

Coromandel Express Accident (Photo Credit: ANI)

Vjy, June 6: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దుర్ఘటన మృతుల్లో ఏపీకి చెందిన వారుంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి ఇది అదనమని పేర్కొన్నారు.

రైలు ప్రమాదం, అధికారులు తీసుకుంటున్న చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ ఆదివారం సమీక్షించారు. ఒడిశా వెళ్లిన మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. బాలేశ్వర్‌లో నివాసముంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించారని, ఆయన తప్ప రాష్ట్రానికి చెందిన వారెవరూ ఈ దుర్ఘటనలో చనిపోయినట్లుగా ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

51 గంటల తర్వాత సాధారణ స్థితికి, ప్రమాద ప్రదేశం నుంచి పట్టాలు ఎక్కిన తొలి రైలు, జర్నీ సేఫ్‌గా సాగాలని ప్రార్ధించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో చిక్కుకున్న రాష్ట్రవాసుల్లో 553 మంది సురక్షితంగా బయటపడ్డారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరో 28 మంది ఆచూకీ తెలియడం లేదని వారిలో కొందరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండగా, కొందరు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఆదివారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో బొత్స సమీక్షించారు. అనంతరం మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

కోరమాండల్‌, యశ్వంత్‌పూర్‌ రైళ్లలో రాష్ట్రానికి చెందిన 695 మంది టికెట్లు బుక్‌ చేసుకోగా, 92 మంది ప్రయాణం చేయలేదు. ప్రయాణించిన వారిలో 553 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిని స్వస్థలాలకు చేరుస్తున్నాం.

వీడియో ఇదిగో, రైలు ప్రమాదం తర్వాత పట్టాలెక్కిన తొలి రైలు, 51 గంటల్లోనే బాలాసోర్‌లో రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి

ఏపీకి చెందిన గురుమూర్తి ఉద్యోగ రీత్యా ఒడిశాలోని బాలేశ్వర్‌లో స్థిరపడ్డారు. స్వస్థలం శ్రీకాకుళం వచ్చి బాలేశ్వర్‌కు యశ్వంత్‌పూర్‌లో వెళ్తూ ప్రమాదంలో చనిపోయారు. ఆయన కుటుంబం బాలాసోర్‌లో ఉంటున్నందున మృతదేహాన్ని అక్కడికే తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.మరో 21 మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిలో నలుగురిని విశాఖకు తరలించి చికిత్స చేయిస్తున్నాం. మరో నలుగురు వస్తున్నట్లు సమాచారముంది.

11మంది చికిత్స తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంకా 28 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్‌ వస్తున్నాయి. వారిలో విశాఖకు చెందిన ఆరుగురు, రాజమహేంద్రవరం ఏడుగురు, విజయవాడ ఏడుగురు, ఒంగోలు ఐదుగురు, నెల్లూరుకు చెందిన వారు ముగ్గురు చొప్పున ఉన్నారు. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.

మొత్తం రైలు ప్రమాద బాధితుల్లో విశాఖ వాసులు 342, రాజమహేంద్రవరం 34, ఏలూరు 10, తాడేపల్లిగూడెం ఇద్దరు, విజయవాడ 176, బాపట్ల 8, గుంటూరు ఇద్దరు, ఒంగోలు 11, నెల్లూరు ముగ్గురు, తిరుపతికి చెందినవారు 107 మంది చొప్పున ఉన్నారు. కోరమాండల్‌లో 484, యశ్వంత్‌పూర్‌ రైలులో 211 మంది ఏపీ వారు ప్రయాణించారు.

రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఆదివారం ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతబొమ్మాళి మండలం ఎం.కొత్తూరుకు చెందిన కె.పూజను మంత్రి పరామర్శించారు.ఆమెను విశాఖలోని అపోలో ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

బాధి­తు­లను ఆదుకునే దిశగా ఏపీ ప్రభు­త్వం పలు చర్యలు చేపట్టిందని వివరించారు. అత్యవసర సేవ­లకు అనుకూలంగా భువనేశ్వర్‌లో 16 అంబులె­న్స్‌­లు, 10 మహా ప్రస్థానం వాహనాలు, బాలాసో­ర్‌లో 5అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచిందని చెప్పారు.ఆచూకీ తెలియని వారి కోసం భువనేశ్వర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి­నట్టు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్ప­టికప్పుడు ఒడిశా అధికారులతో సంప్రదింపులు చేస్తోందన్నారు. భువనేశ్వర్‌లోని ఆస్పత్రుల్లో 120 గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయ­న్నారు. మృతులను గుర్తించడానికి కుటుంబసభ్యులను తీసు­కెళ్లేందుకు వాహ­నాలను ఏర్పా­టు చేసినట్టు చెప్పా­రు.

సహా­యం కోసం 1929 హెల్ప్‌లైన్‌తో పాటు ప్రత్యేక అధికారి తిరుమల నాయక్‌(ఐఏఎస్‌) 8895351188ను బాధిత కుటుంబాలు సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల, మృతుల వివరా­లను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారన్నారు. కటక్‌ రైల్వేస్టేషన్, బస్టాండ్, ఎస్‌సీబీ మెడికల్‌ కళాశాల, భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్, బారముండా బస్టాండ్, విమా­నాశ్రయంలో హెల్ప్‌డెస్క్‌లు పని చేస్తున్నాయన్నారు.

విజయవాడలో దిగాల్సిన ప్రయాణికుల్లో 11 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబసభ్యులకు సమా­చారం అందించేందుకు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్‌ నంబర్‌ల­ను అందుబాటులో ఉంచామని రైల్వే అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 1070, 18004250101, 833390­5022 (వాట్సాప్‌) సంప్రదించవ్చని తెలిపారు.