Andhra Pradesh: కానిస్టేబులే కామాంధుడైన వేళ, ఎవరూ లేని సమయంలో వివాహితపై ఇంట్లోకి దూరి అత్యాచార యత్నం, బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టు చేసిన దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు

ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌) కానిస్టేబుల్‌ ఆదినారాయణ బాధ్యత కల్గిన ఉద్యోగంలో ఉంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చేలా వ్యవహరించాడు. ఓ వివాహితను బలాత్కారం (constable Arrested for Attempt Rape) చేయబోయిన అతన్ని దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు సోమవారం అరెస్టు చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Amaravati, Oct 5: అనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌) కానిస్టేబుల్‌ ఆదినారాయణ బాధ్యత కల్గిన ఉద్యోగంలో ఉంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చేలా వ్యవహరించాడు. ఓ వివాహితను బలాత్కారం (constable Arrested for Attempt Rape) చేయబోయిన అతన్ని దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు సోమవారం అరెస్టు చేశారు.

పోలీసుల కథనం మేరకు.. ఆదినారాయణ 2005వ సంవత్సరంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరాడు.ప్రస్తుతం సెబ్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నాడు. అనంతపురంలోని రుద్రంపేటలో నివాసముంటున్నాడు. ఇతనికి నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో మిత్రుడు ఉన్నాడు. తరచూ అతని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో మిత్రుడి ఇంట్లో బాడుగకు ఉంటున్న ఓ కుటుంబంలోని వివాహితపై కన్నేశాడు. ఈ నెల మూడున ఉదయం ఎవరూ లేని సమయంలో వివాహిత ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెతో మాటలు కలిపాడు. అతని వాలకాన్ని పసిగట్టిన ఆమె తన అన్నకు ఫోన్‌ చేసి.. మాట్లాడకుండా అలాగే ఉంచింది.

హైకోర్టు ఎదుటే దంపతులు ఆత్మాహత్యం, భూమి మాదని ఏపీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కొందరు నేతలు బెదిరిస్తున్నారంటూ ఆవేదన

ఆదినారాయణ బలాత్కారం చేయబోయాడు. అదే సమయంలో అన్న ఇంటికి చేరుకుని అతనికి చీవాట్లు పెట్టి అక్కడి నుంచి పంపేశాడు. అదే రోజు బాధిత మహిళ కుటుంబ సభ్యులతో కలిసి దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దిశ డీఎస్పీ శ్రీనివాసులు ఈ విషయాన్ని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని ఎస్పీ ఆదేశించారు. అనంతరం ఆదినారాయణపై అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం అతన్ని డీపీఓలో దిశ డీఎస్పీ అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. కాగా.. ఆదినారాయణ సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.