Andhra Pradesh: హైకోర్టు ఎదుటే దంపతులు ఆత్మాహత్యం, భూమి మాదని ఏపీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కొందరు నేతలు బెదిరిస్తున్నారంటూ ఆవేదన
HIGH COURT OF ANDHRA PRADESH| (Photo-Twitter)

Amaravati, Oct 5: తమ స్థలం విషయంలో హైకోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చినా.. ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కొందరు బెదిరిస్తున్నారని గుంటూరు జిల్లా ధూళిపాళ్లకు చెందిన భార్యాభర్తలు దేవేంద్రరావు, భానుశ్రీలు సోమవారం హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం (couple suicide attempt) చేశారు. ఒంటిపై డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్రత్యేక రక్షణ దళం(ఎస్‌పీఎఫ్‌) పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఆ దంపతులు మాట్లాడుతూ... ‘1997 నుంచి మా స్థలంలో నివాసం ఉంటున్నాం. 2003లో ప్రభుత్వం పట్టా కూడా ఇచ్చింది. ఆ స్థలంలో 2017లో బస్‌షెల్టర్‌ నిర్మించేందుకు యత్నించగా అప్పట్లో హైకోర్టును ఆశ్రయించాం. న్యాయస్థానం మాకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చి, ఖాళీ చేయించొద్దని (andhra pradesh high court due to land issue) పేర్కొందని భాదితుడు వివరించారు. కొందరు రాజకీయ నాయకులు హైకోర్టు ఉత్తర్వులు చెల్లవని, దిక్కున్న చోట చెప్పుకోవాలని, పది రోజుల్లో ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని వారు కన్నీరుపెట్టుకున్నారు.

ఈబీసీ నేస్తం పథకానికి అర్హతలు, చివరి తేదీ, వయసు ఎంత ఉండాలి, వైఎస్సార్ ఈబీసీ నేస్తం సమగ్ర వివరాలు మీ కోసం

మేము చెప్పిందే న్యాయం, చట్టం అని వారు మాట్లాడుతున్నారు. మీ కుటుంబం ఒక్కటే ఎవడు వచ్చి కాపాడుతాడు అని హింసపెడుతున్నారు. దాంతో చచ్చిపోదామని వచ్చాం...’ అని దేవేంద్రరావు, భానుశ్రీ పేర్కొన్నారు. ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది సమాచారం మేరకు తుళ్లూరు పోలీసులు హైకోర్టుకు చేరుకుని వారిని అమరావతిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి ఠాణాకు తీసుకొచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ పోతురాజు చెప్పారు.