Coronavirus Alert in AP: ఏపీలో కరోనాపై నియంత్రణ, మరోసారి సమగ్ర సర్వే, ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు

ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నమోదు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) ఆదేశించారు. ఇప్పటివరకూ విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిపైనే కాకుండా ప్రజలందరి మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు.

Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Mar 25: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సమగ్ర సర్వే(Another Comprehensive survey) నిర్వహించనున్నారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలనూ వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు నమోదు చేయనున్నారు.

కోవిడ్ 19 మీద చంద్రబాబు జాగ్రత్తలు

ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) ఆదేశించారు. ఇప్పటివరకూ విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారిపైనే కాకుండా ప్రజలందరి మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు.

మంగళవారం తన నివాసంలో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై (Coronavirus Review Meeting) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీఎంసీ ఛైర్మన్‌ సాంబశివారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ స్పెషల్‌ సెక్రటరీ కన్నబాబు పాల్గొన్నారు.

కరోనావైరస్ ఎఫెక్ట్,  ఆంధ్ర ప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా

మార్చి 26లోగా సర్వే పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సర్వే సమగ్రంగా జరిపేందుకు ప్రజలు సహకరించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలంతా ఇళ్లలోనే ఉండి పాటించాలని చెప్పారు. డేటా ప్రకారం.. కోవిడ్‌–19 నివారణకు మరిన్ని చర్యలు చేపట్టనున్నారు. సర్వే సమగ్రంగా జరిగేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటించాలన్నారు.

లాక్‌డౌన్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు

‘ప్రజలు బయట తిరిగితే.. ఒకరి నుంచి ఇంకొకరికి కరోనావైరస్ వ్యాపిస్తుంది. అందువల్ల లాక్‌డౌన్‌ను ప్రజలంతా పాటించాలి. మీరు ఇంట్లో ఉండడం వల్ల వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు చేసే సర్వేకు సహకరించిన వారు అవుతారు. రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణకు ప్రజలనుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నామని’ సీఎం పేర్కొన్నారు.

మార్చి 31 వరకు ఏపీ లాక్‌డౌన్

రాష్ట్రంలో ఇప్పటి వరకూ పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ కూడా విదేశాలనుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారేనని సీఎం తెలిపారు. సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని సీఎం సూచించారు. రెండోసారి సర్వే ద్వారా వచ్చే డేటాను విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందన్నారు. లక్షణాలు ఉన్నవారు విధిగా హోం ఐసోలేషన్‌ పాటించాలని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.



సంబంధిత వార్తలు

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు