
Amaravati, Mar 22: కరోనా వైరస్ (Coronavirus) తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్ డౌన్ (AP Lockdown) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు, 5కు చేరిన మొత్తం కరోనా కేసులు
మార్చి 31 వరకు ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. పదిమంది కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ కూలీలు మాత్రం పొలం పనులకు వెళ్లినప్పుడు రెండు మీటర్ల దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు.
గోడౌన్లు, ఫ్యాక్టరీలు అతి తక్కువ సిబ్బందితో నడపాలని సూచించారు. మార్చి 29 వ తేది నాటికి పూర్తిగా రేషన్ అందుబాటులోకి ఉంటుందని, రేషన్ ఫ్రీగా ఇవ్వడమేక కాకుండా కేజీ పప్పును ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.1000 అందిస్తామని తెలిపారు.
మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్
విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా 14 రోజులు ఇళ్లలోనే ఉండాలన్నారు. అందరూ 14 రోజుల పాటు ఇళ్లలోంచి కదలొద్దని కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు.
Here's AP CMO Tweet
I salute the indomitable spirit of our healthcare workers, army personnel, police & everyone out there working around the clock so that we are safe at our homes. We are indebted to them for their service during these tough times . 👏 #JanataCurfew #IndiaFightsCorona pic.twitter.com/AvXAQ9S2xM
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2020
కరోనావైరస్ కట్టడి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినా జనతా కర్ఫ్యూ పిలుపునకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులతో కలిసి చప్పట్లు కొట్టి వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు.
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అమలు చేయడంతోపాటు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు మొదలు క్షేత్రస్థాయి వరకు ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.
ఏపీలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు (COVID-19 in AP) నమోదయ్యాయి. విజయవాడలో ఒకటి, కాకినాడలో మరొకటి తాజాగా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. కొత్తగా నమోదైన రెండు కేసులూ విదేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.