AP's Coronavirus Report: ఏపీలో 10 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, తాజాగా 497 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 10,331కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు (Coronavirus cases) నమోదవగా, ఈ వైరస్‌ బారినపడినవారిలో 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య (AP's Coronavirus Report) 10,331కి చేరగా, 129 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 5,423 యాక్టివ్‌ కేసులు ఉండగా, మరో 4779 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 37 మంది, రాష్ర్టానికి చెందినవారు 448 మంది ఉన్నారు.

Coronavirus (Photo Credits: IANS)

Amaravati, June 24: ఏపీలో కరోనా కేసులు పదివేల మార్కును దాటాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 497 కరోనా కేసులు (Coronavirus cases) నమోదవగా, ఈ వైరస్‌ బారినపడినవారిలో 10 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య (AP's Coronavirus Report) 10,331కి చేరగా, 129 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 5,423 యాక్టివ్‌ కేసులు ఉండగా, మరో 4779 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు 12 మంది ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చినవారు 37 మంది, రాష్ర్టానికి చెందినవారు 448 మంది ఉన్నారు. వైఎస్సార్ పుట్టిన రోజున ఏపీ సీఎం భారీ గిఫ్ట్, పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ, ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు

ఇదిలా ఉంటే కరోనావైరస్‌ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారి రికార్డ్‌ సృష్టించింది. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. గడిచిన 24 గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో 448 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Here's AP Corona Report

వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఉగ్రరూపం దాల్చిన కరోనా, దేశంలో ఒక్కరోజే 465 మంది మృతి, ఇండియాలో నాలుగు లక్షల యాభై వేలు దాటిన కోవిడ్-19 కేసులు

ఇప్పటివరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. 4,779 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో46.26 శాతం రికవరీ రేటుగా ఉంది. 10లక్షల మందికి సగటున 14,049 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఏపీలో పాజిటివ్‌ శాతం 1.38కాగా, దేశంలో పాజిటివ్‌ శాతం 6.20గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,423 యాక్టివ్ కేసులు ఉన్నాయి.



సంబంధిత వార్తలు

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif