Tirupati Lockdown: తిరుపతిలో మళ్లీ పూర్తిగా లాక్‌డౌన్, వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొనసాగనున్న ఆంక్షలు, శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత, సంతాపం తెలిపిన టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా దుకాణాల‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. ఈ స‌మ‌యం దాటాకా వాహ‌నాల‌కు కూడా అనుమ‌తి ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపారు. జిల్లాలో కోవిడ్-19 వైరస్‌ ( COVID-19) తీవ్ర‌త అధిక‌మ‌వుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు.

COVID-19 lockdown in India | (Photo Credits: IANS)

Amaravati, July 20: క‌రోనావైరస్ కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో తిరుప‌తిలో రేప‌టినుంచి సంపూర్ణ ఆంక్ష‌లు (Tirupati Lockdown) విధిస్తున్న‌ట్లు కలెక్ట‌ర్ నారాయణ భరత్ గుప్తా సోమవారం ప్ర‌క‌టించారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా దుకాణాల‌కు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. ఈ స‌మ‌యం దాటాకా వాహ‌నాల‌కు కూడా అనుమ‌తి ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల 5 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని తెలిపారు. జిల్లాలో కోవిడ్-19 వైరస్‌ ( COVID-19) తీవ్ర‌త అధిక‌మ‌వుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు. ఏపీలో 13 లక్షలు దాటిన కరోనా టెస్టులు, తెనాలి ఎమ్మెల్యేకి కోవిడ్-19, లాక్‌డౌన్ ప్రకటించిన షార్‌, మానవత్వాన్ని మింగేస్తోన్న కరోనావైరస్

చిత్తూరు జిల్లా (Chittoor district) వ్యాప్తంగా క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు చిత్తూరులో 5400 క‌రోనా కేసులు న‌మోదుకాగా, వీటిలో అత్య‌ధికంగా తిరుప‌తిలోనే 1700 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆంక్ష‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తూ జిల్లా కలెక్ట‌ర్ నారాయ‌ణ భ‌ర‌త్ గుప్తా ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌తీ ఒక్క‌రూ విధిగా నిబంధ‌న‌లను పాటించి స‌హ‌క‌రించాల‌ని ఎస్పీ రమేష్ రెడ్డి కోరారు. పోలీసు శాఖ‌లోనూ క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌ని, ఇప్ప‌టికే ఇద్ద‌రు పోలీసులు క‌రోనా కారణంగా మ‌ర‌ణించార‌ని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 50 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య

అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత

తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు (Srinivasa Murthy) సోమవారం కన్నుమూశారు. శ్రీనివాసమూర్తి దీక్షితులు కరోనా వైరస్‌ సోకడంతో గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా సేవలు అందించారు. గత ఏడాది పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ అనంతరం ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. ఏడాదిగా శ్రీవారి కైంకర్యాలకు దూరంగా ఉ​న్నారు. తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందితో నాలుగు రోజులకు ముందు స్వీమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు.

వైవీ సుబ్బారెడ్డి ప్రగాఢ సంతాపం

శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి ప‌ట్ల టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి ఆలయంలో వంశపారంపర్య కుటుంబాల నుంచి సేవలందిస్తున్న వారు ఎవరైనా పరమపదిస్తే ఆలయ సంప్రదాయం ప్రకారం సంప్రదాయ పద్ధతిలో వీడ్కోలు పలకాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన కరోనా బారిన పడి మృతి చెందడంతో మృతదేహాన్ని కూడా కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం లేని పరిస్థితి నెలకొంది. దీంతో కుటుంబ‌స‌భ్యులే సాంప్ర‌దాయ ప‌ద్దతిలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif