AP Coronavirus: కరోనాపై ఊరట..ఏపీలో 3 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో యాక్టివ్‌గా 97,681 కోవిడ్ కేసులు, తాజాగా 10,548 మందికి కోవిడ్-19, ఇప్పటివరకు కరోనాతో 3,796 మంది మృతి
కోవిడ్ (AP coronavirus) నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,976 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకూ మొత్తం 3,12,687 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 82 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 3,796 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 36,03,345 మందికి కరోనా పరీక్షలు చేశారు.
Amaravati, August 29: ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు రికవరీ రేటు పెరుగుతోంది. కోవిడ్ (AP coronavirus) నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,976 మంది డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకూ మొత్తం 3,12,687 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 82 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 3,796 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 36,03,345 మందికి కరోనా పరీక్షలు చేశారు.
గత 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 10,548 మందికి పాజిటివ్ (New Covid-19 cases) వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు (Andhra pradesh corona cases) చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం
చిత్తూరు జిల్లాలో 15, నెల్లూరులో 11, తూర్పుగోదావరిలో, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 08 మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు. కడప, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. మహిళల కంటే పురుషులకే వైరస్ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్
AP Corona Report:
స్వర్ణ ప్యాలెస్ ఘటన నేపథ్యంలో నగరంలో మరో నాలుగు ఆస్సత్రుల్లో కోవిడ్ వైద్యానికి ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. ఎలైట్ అడ్వాన్స్‌డ్ కోవిడ్-19 కేంద్రానికి సర్కార్ అనుమతి రద్దు చేసింది. అలాగే సాయి మాధవి ఆస్పత్రి, అనిల్ న్యూరో అండ్ ట్రామా సెంటర్, బీఎన్ శ్రీరామ్ ఆస్పత్రిలో కోవిడ్ వైద్యానికి అనుమతి రద్దు చేసింది. అధిక ఫీజులు వసూలు చేయడం, ఫైర్ సేఫ్టీ అనుమతులు సక్రమంగా లేవన్న ఆరోపణలతో..ఆయా ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యానికి ప్రభుత్వం అనుమతులు రద్దు చేసింది. కాగా ఇప్పటికే 5 కోవిడ్ కేంద్రాల్లో వైద్యానికి సర్కార్ అనుమతి రద్దు చేసిన విషయం తెలిసిందే.