AP Coronavirus Bulletin: ఏపీలో 95 ఏళ్ల వృద్ధుడు కరోనాని జయించాడు, లక్ష మార్కును దాటిన కోవిడ్ డిశ్చార్స్ కేసులు, తాజాగా 10,128 కేసులు నమోదు, లక్షా 90 వేలకు చేరువలో కోవిడ్-9 కేసులు

గ‌డిచిన 24 గంట‌ల్లో 60,576 క‌రోనా వైర‌స్‌ ప‌రీక్ష‌లు చేయ‌గా 10,128 పాజిటివ్ కేసులు (new coronavirus cases) న‌మోదైన‌ట్లు వైద్యారోగ్య శాఖ బుధ‌వారం హెల్త్ బులెటిన్‌లో ( health bulletin) పేర్కొంది. దీంతో మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 22,35,646కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 1,86,461గా న‌మోదైంది. కొత్త‌గా 8,729 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కు చేరింది.

2020 Coronavirus Pandemic in India (photo-Ians)

Amaravati: ఆంధ‌ప్ర‌దేశ్‌లో కేసుల సంఖ్య మ‌రోసారి‌ ప‌ది వేలు (AP Coronavirus Bulletin) దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 60,576 క‌రోనా వైర‌స్‌ ప‌రీక్ష‌లు చేయ‌గా 10,128 పాజిటివ్ కేసులు (new coronavirus cases) న‌మోదైన‌ట్లు వైద్యారోగ్య శాఖ బుధ‌వారం హెల్త్ బులెటిన్‌లో ( health bulletin) పేర్కొంది. దీంతో మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 22,35,646కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 1,86,461గా న‌మోదైంది. కొత్త‌గా 8,729 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కు చేరింది.

తాజాగా 77 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోవ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కు మర‌ణించిన వారి సంఖ్య 1681కు చేరింది. ప్ర‌స్తుతం 80,426 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 77 మంది (coronavirus Deaths) కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో ఏకంగా 16 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 8,729 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,35,646 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. ఏపీలో అన్‌లాక్ 3.0 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ ప్రక్రియ, కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్

పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో జగన్నాథపురం గ్రామానికి చెందిన 95 ఏళ్ల వృద్ధుడు షేక్‌ అబ్దుల్లా కరోనా నుంచి కోలుకున్నారు. గత నెల 22న జ్వరం, ఆయాసం రావడంతో కుటుంబసభ్యులు వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చి పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు మరింత మెరుగైన చికిత్స అందించారు. దీంతో వృద్ధుడు కోలుకున్నారు. ఈ నెల 31న డిశ్చార్జ్‌ చేశారు. కరోనాపై భారీ ఊరట, రికవరీ రేటు 67.19కి పెరిగిందని తెలిపిన ఆరోగ్య శాఖ, మృతుల శాతం 2.09కి తగ్గిందని వెల్లడి, దేశంలో 19 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు

ఏపీలో కరోనా వైరస్‌ను జయించిన వారి సంఖ్య లక్ష మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 8,729 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కి చేరగా రికవరీ రేటు 55.97 శాతానికి పెరిగింది.