AP Coronavirus: ఏపీలో కరోనా డేంజర్ బెల్స్, అయినా ప్రజల్లో నిర్లక్ష్యం, నిన్న ఒక్కరోజే మాస్కులు ధరించని వారి నుంచి రూ.17.34 లక్షలు వసూలు, తాజాగా 1,005 మందికి కరోనా పాజిటివ్

ఈ క్రమంలో మాస్కులు పెట్టుకోవడంపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా బయటికి వస్తున్నవారికి జరిమానా వడ్డించారు. నిన్న ఒక్కరోజే 18,565 మందికి జరిమానాలు విధించడం ద్వారా రూ.17.34 లక్షలు వసూలు చేశారు.

Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, Mar 29: ఏపీలో కొత్త కేసుల సంఖ్య తాజాగా 1000 దాటింది. గడచిన 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు చేయగా 1,005 మందికి పాజిటివ్ (Covid in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 225 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 184, విశాఖ జిల్లాలో 167, కృష్ణా జిల్లాలో 135 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 324 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,98,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,216 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. కొత్త కేసులకు తగ్గట్టుగానే యాక్టివ్ కేసుల సంఖ్య కూడా మరింత పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 5,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 7,205కి (Coronavirus Death Toll) చేరింది.

కరోనా మళ్లీ విస్తరిస్తుండడంతో ఏపీలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మాస్కులు పెట్టుకోవడంపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా బయటికి వస్తున్నవారికి జరిమానా వడ్డించారు. నిన్న ఒక్కరోజే 18,565 మందికి జరిమానాలు విధించడం ద్వారా రూ.17.34 లక్షలు వసూలు చేశారు.

Here's Covid Updates in AP

విశాఖపట్నం నగరంలో 1,184 మందికి రూ.1,16,700, తూర్పు గోదావరి జిల్లాలో 2,299 మందికి రూ.1,78,050, విజయవాడలో 2,106 మందికి రూ.1,93,850, గుంటూరు అర్బన్‌లో 844 మందికి రూ.1,05,720 జరిమానా విధించారు.

అత్యధికంగా ప్రకాశం జిల్లా పోలీసులు రూ.2.10 లక్షలు జరిమానాల రూపంలో రాబట్టారు. అత్యల్పంగా రాజమండ్రి అర్బన్ పోలీసులు రూ,2,800 వసూలు చేశారు. కాగా, పలు చోట్ల పోలీసులే మాస్కులు పంచారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. మాస్కులు ధరించిన వారికి గులాబీ పూలు ఇచ్చి అభినందించారు.

కమ్మేసిన పొగ..విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, గ్యాస్ సిలిండర్ల లారీ-రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, ముగ్గురు దుర్మరణం, పలువురి పరిస్థితి విషమం

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీస్‌ శాఖ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిందని, ఇందుకు ప్రజలు సహకరించాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక ప్రకటన చేస్తూ.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నిబంధనల్ని పౌరులంతా కచ్చితంగా పాటించాలని కోరారు. కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించడంతో కఠిన చర్యలు చేపట్టామన్నారు.మాస్కులు ధరించని వారికి, కోవిడ్‌ నియమావళిని పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.

అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని, నిత్యావసర సరుకులు, అత్యవసరాల కోసమే బయటకు రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవడం, వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు.

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, 11 మంది అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీని ఢీకొట్టిన టెంపో, గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు వద్ద టిప్పర్‌ను ఢీకొట్టిన ఆటో

బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్‌ వాడటం, భౌతిక దూరం పాటించటం వంటివి విధిగా పాటించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, విద్యార్థులు కోవిడ్‌ నియమాలు కచ్చితంగా పాటించేలా చూడాలని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యాసంస్థల అధికారులకు సూచించారు.



సంబంధిత వార్తలు