Vizianagaram, Mar 29: విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Vizianagaram Road Accident) చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈక్రమంలోనే అటుగా వస్తున్న ఒక లారీ ప్రమాదానికి గురైన ఒక ఆర్టీసి బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. వీరిని వైజాగ్‌లోని కెజిహెచ్‌కు తరలించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్, మజ్జి శ్రీనివాసరావు, జిల్లా ఎస్‌పి బి.రాజకుమారి, జెసి కిషోర్‌కుమార్, ఆర్‌డిఒ భవానీశంకర్, తదితరులు పరామర్శించారు.
ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లారీ, మరో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో (Andhra Pradesh Road Accident) పరిస్థితి భయానకంగా మారింది. సుంకరిపేట వద్ద ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.
అదే సమయంలో విశాఖ నుంచి విజయనగరం వైపు వెళ్తున్న మరో ఆర్టీసీ బస్సు ఈ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డులో సిబ్బంది చెత్తను తగులబెట్టారు. దీంతో రహదారిని పొగ దట్టంగా కమ్మేయడంతో దారి కనిపించలేదు. ప్రమాదానికి ఇదే కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Here's ANI Update
Andhra Pradesh: Three people died after two buses they were travelling in collided head-on in Vizianagaram district early morning today.
"Drivers of the two buses & a passenger have lost their lives. Five others have sustained serious injuries," a police inspector said. pic.twitter.com/aVqcZRcg9o
— ANI (@ANI) March 29, 2021
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు రెండు బస్సుల్లో ఇరుకుపోయిన చాలా మంది ప్రయాణికులను బయటకి తీస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలం వద్దకు అంబులెన్స్ లు, పోలీసులు, ఆర్‌టిసి అధికారులు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి ఎస్పీ రాజకుమారి, ఆర్‌డిఒ భవాని శంకర్, తహశీల్దార్ ప్రభాకర్ చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను పొక్లెయినర్లతో తొలగిస్తున్నారు. నెమ్మదిగా ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులతో ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. లారీ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ఆయనకు చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు జగన్ సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.