Free Ration Distribution in AP: ఏపీలో ఉచితంగా రేషన్ సరుకులు, నెల సరుకులను ముందుగానే పంపిణీ చేస్తున్న ఏపీ సర్కారు, మార్చి 29 నుంచి ఏప్రిల్‌ చివరిలోగా 3సార్లు ఇవ్వాలని నిర్ణయం

దేశంలోని దాదాపు అన్నీ రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ ( coronavirus lockdown) అమలు అవుతున్న నేపథ్యంలో సామాన్యులు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (Andhra Pradesh government) కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకులను అందరికీ ఉచితంగా (Free Ration Distribution in AP) అందిస్తోంది.

Covid 19 outbreak Andhra Pradesh government distributes free ration to poor amid coronavirus lockdown (Photo-Twitter)

Amaravati, Mar 30: కరోనావైరస్ (Covid 19 outbreak) దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) అమలవుతోంది. దేశంలోని దాదాపు అన్నీ రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్ ( coronavirus lockdown) అమలు అవుతున్న నేపథ్యంలో సామాన్యులు నిత్యావసర సరుకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (Andhra Pradesh government) కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ సరుకులను అందరికీ ఉచితంగా (Free Ration Distribution in AP) అందిస్తోంది.

వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి

కోవిడ్ 19ను (COVID-19) ఎదుర్కోవడానికి లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా వచ్చే నెల (ఏప్రిల్‌)లో ఇవ్వాల్సిన ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీని ఏపీ సర్కారు మూడు రోజుల ముందుగానే చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకే 29,620 రేషన్‌ షాపులను తెరిచి ఉచిత రేషన్‌ సరుకులను అందించింది. ఇందులో భాగంగా మొదటి రోజు 17.12 లక్షల కుటుంబాలు ఉచిత సరుకులు తీసుకున్నాయి. ఇందులో 3.17 లక్షల కుటుంబాలు పోర్టబిలిటీని సద్వినియోగం చేసుకున్నాయి.

ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలి, ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు

రేషన్‌ కార్డుల్లో నమోదై ఉన్న పేర్లలో ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు అందించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ క్యూ లైన్లో నిలబడి సరుకులు తీసుకున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సరుకుల పంపిణీని ప్రారంభించి పర్యవేక్షించారు. కాగా మార్చి 29 నుంచి ఏప్రిల్‌ చివరిలోగా మూడుసార్లు ఉచిత రేషన్‌ సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు.

ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు

పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరికీ సరుకులు అందాలనే ఉద్దేశంతో ఏప్రిల్‌ 15 వరకు ఈ సరుకులను పంపిణీ చేయనున్నారు. తొలి రోజు ఆదివారం రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల కుటుంబాలు, అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 70,895 కుటుంబాలు ఉచిత సరుకులు తీసుకున్నాయి.

మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం

కాగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రతి రేషన్‌ షాపు వద్ద ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రతి రేషన్‌ షాపు వద్ద ప్రతి మీటర్‌ దూరానికి ప్రత్యేకంగా మార్కింగ్‌ వేశారు. లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకోకుండా వీఆర్వో, గ్రామ సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్‌ ద్వారా సరుకులు పంపిణీ చేశారు.

మార్చి 31 వరకు ఏపీ లాక్‌డౌన్, అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు నిలిపివేత

చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు, నీళ్లు, శానిటైజర్‌లు అందుబాటులో ఉంచారు. గ్రామ వలంటీర్లు, ఇతర సిబ్బంది కార్డుదారులకు సహాయమందించారు. కొన్ని రేషన్‌ దుకాణాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తగా అధికారులు వెంటనే పరిష్కరించారు.



సంబంధిత వార్తలు