Covid-19 Patient Selfie Video: సెల్ఫీ వీడియోలో కరోనా పేషెంట్ కన్నీటి ఆవేదన, నా మూలంగా నా ఫ్యామిలీని బ్లేమ్ చేయవద్దంటూ వినతి, త్వరగా బయటకు వచ్చేలా సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్

అతను ప్యారిస్ (Paris) నుంచి వచ్చాడు. ఢిల్లీలో (Delhi) స్క్రీనింగ్ జరిగినా అక్కడ నెగిటివ్ వచ్చింది. అయితే రెండు రోజుల తర్వాత అతనికి పాజిటివ్ రావడంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. ఈ సంధర్భంగా సెల్పీ వీడియో (Covid-19 Patient Selfie Video) విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని సెల్ఫీ వీడియోలో కోరాడు.

Covid-19 Outbreak in andhra pradesh Vijayawada CoronaVirus Patient Selfie Video he requested don't blame my Family (Photo-Youtube grab)

Amaravati, Mar 23: ఏపీలో కరోనావైరస్ (CoronaVirus)మెల్లిగా చాపకింద నీరులా విస్తరించుకుంటూ వెళుతోంది. ఇప్పటికే ఏపీలో (Andhra Pradesh) అయిదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా విజయవాడలో (Vijayawada) కరోనా పాజిటివ్ కేసు ఒకటి వెలుగుచూసింది. అతను ప్యారిస్ (Paris) నుంచి వచ్చాడు. ఢిల్లీలో (Delhi) స్క్రీనింగ్ జరిగినా అక్కడ నెగిటివ్ వచ్చింది.

కరోనా భయం, సుప్రీంకోర్టు పాక్షిక మూసివేత

అయితే రెండు రోజుల తర్వాత అతనికి పాజిటివ్ రావడంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. ఈ సంధర్భంగా సెల్పీ వీడియో (Covid-19 Patient Selfie Video) విడుదల చేశాడు. కరోనాను ఎదుర్కొనేందుకు తనకు మద్దతివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దని సెల్ఫీ వీడియోలో కోరాడు.

దేశంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

సెల్ఫీ వీడియోలో ఏమన్నాడంటే..

‘‘అందరికి నమస్కారం, నా పేరు హేమంత్. నేను విద్యార్థిని. వయసు 24 ఏళ్లు. ప్యారిస్ నుంచి వచ్చాను. మార్చి 16న ఉదయం 9గంటలకు విమానంలో ఢిల్లీ వచ్చాను. ఢిల్లీలో స్క్రీనింగ్ జరిగినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడంతో నన్ను పంపేశారు. మార్చి 17న హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ లో ప్రైవేట్ క్యాబ్ లో మధ్యాహ్నం 12కి బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విజయవాడలో ఇంటికి చేరాను. తర్వాత మున్సిపల్ విజిలెన్స్ టీమ్ మా ఇంటికి వచ్చింది. 14రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండాలని నాతో చెప్పారు. వాళ్లని గౌరవించి ఇంట్లోనే ఉన్నా. ఎక్కడికీ వెళ్లలేదు. కరోనా లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత నాకు ఫీవర్ వచ్చింది. దీంతో స్వయంగా నేనే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా అధికారులకు ఫోన్ చేసి చెప్పాను. టెస్టు చేయించుకుంటే నాకు పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మెడికేషన్ లో ఉన్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు దయచేసి నాకు సపోర్ట్ చేయండి. అంతేకాని నన్ను, నా కుటుంబాన్ని ఎమోషనల్ గా బ్లేమ్ చేయొద్దు. నేను త్వరగా రికవర్ అయ్యి బయటకు వచ్చి చాలామందికి మోటివేషన్ గా ఉండాలని కోరుకుంటున్నా'' అని సెల్ఫీ వీడియోలో రిక్వెస్ట్ చేశాడు.

కాగా యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విజయవాడ వచ్చాక అతడు ఎవరెవరిని కలిశాడు, ఏయే ప్రాంతాలకు వెళ్లాడు, ఎంత మందితో మాట్లాడాడు, ఎంత మందితో కరచాలనం చేశాడు అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా బాధితుడి కుటుంబసభ్యులు 500మంది వివరాలు సేకరించారు. వారంతా ప్రస్తుతం నార్మల్ గానే ఉన్నట్టు గుర్తించారు.

అయినప్పటికి ముందు జాగ్రత్తగా అధికారులు వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపారు . అలాగే బాధితుడిని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ ని గుర్తించిన అధికారులు అతడికి ఫోన్ చేసి మాట్లాడారు. అతడు మాములుగానే ఉన్నట్టు నిర్ధారించారు. అలాగే బాధితుడు నివాసం ఉండే బెజవాడ పాతబస్తీ ప్రాంతంలో సైతం అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అతను త్వరగా మాములు మనిషి కావాలని కోరుకుందాం.