New Delhi, March 23: భారతదేశంలో కరోనావైరస్ (Coronavirus Spreads) చాపకింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus Cases in India), మరణాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 64 కొత్త కేసులు బయటపడ్డాయి.
మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోండి: ప్రధాని మోదీ
సోమవారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుతం కరోనా మృతుల సంఖ్య (COVID-19 Deaths in India) ఎనిమిదికి చేరింది. మహారాష్ట్రలో (Maharashtra) పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అక్కడ మూడో మరణం నమోదైంది.
లాక్‌డౌన్ అంటే ఏమిటి, ఏమి చేయవచ్చు..ఏమి చేయకూడదు
వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న పిలిఫ్పిన్స్ దేశస్తుడు ఆదివారం రాత్రి కన్నుమూశాడు.ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన 68 ఏళ్ల వ్యక్తి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు. తొలుత వైద్య పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స అందించగా కోలుకున్నాడు. అంతా సజావుగా ఉందనుకుంటున్న తరుణంలో ఇవాళ ఆయన మృత్యువాత పడ్డాడు.
లాక్‌డౌన్ దిశగా ఇండియా, ఇప్పటికే లాక్‌డౌన్‌లో 8 రాష్ట్రాలు
కాగా తొలుత ప్రభుత్వ కస్తూర్బా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించామని, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా నెగిటివ్ అని రిపోర్ట్ వ్చచిందని బ్రిహాన్ ముంబై కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కాగా మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య 89కు పెరిగింది. నిన్న రాత్రి నుంచి 15 కొత్త కేసులు గుర్తించినట్టు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.అలాగే కేరళలో 64, ఢిల్లీలో 30, రాజస్థాన్‌లో 28, తెలంగాణ 27, ఉత్తరప్రదేశ్ 27, కర్ణాటక 27, గుజరాత్‌లో 18, ఏపీలో 5మందికి వైరస్ సోకింది. కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుండటంతో కేసుల కోసం ప్రతీ జిల్లాలోనూ ఓ ఆసుపత్రిని ప్రభుత్వం కేటాయించింది .
కరోనా విజృంభణతో మహారాష్ట్ర తీవ్రంగా ప్రభావితమవుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదదు కావడంతో ఆ రాష్ట్రంలో 144సెక్షన్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా స్టేజ్3 దిశగా పయనిస్తోంది. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.
విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, విదేశాల నుంచి వచ్చిన వారు దయచేసి బయట తిరగవద్దని ప్రభుత్వం కోరుతుంది. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచనలు చేస్తున్నారు.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మహారాష్ట్ర అధికార యంత్రాంగం మార్చి 31వ తేదీ వరకు రైళ్లను రద్దు చేశారు. అత్యవసరం కానీ సేవలన్నింటిని బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు.