COVID-19 in AP: ఏపీలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, 190కి చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసులు, బులెటిన్ విడుదల చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి
శనివారం ఉదయం 16 కరోనా పాజిటివ్ కేసులు (positive cases) నమోదు కాగా తాజాగా మరో 10 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
Amaravati, April 4: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు (COVID-19 in AP) రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 16 కరోనా పాజిటివ్ కేసులు (positive cases) నమోదు కాగా తాజాగా మరో 10 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొత్తగా కృష్ణా జిల్లాలో 5, గుంటూరులో 3, ప్రకాశం, అనంతపురం జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
కరోనా కాటుకు కుల, మత భేదాలు లేవు
జిల్లాల వారిగా నెల్లూరు, కృష్ణాలో అత్యధికంగా 32, గుంటూరు 26, వైఎస్సార్ కడప 23, ప్రకాశం 19, పశ్చిమ గోదావరి 15, విశాఖపట్నం 15, చిత్తూరు 10, తూర్పు గోదావరి 11, కర్నూలు 4, అనంతపురంలో 3 పాటిజివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఏపీలో కరోనా మృతుల సంఖ్య రెండుకి చేరింది. శుక్రవారం నాడు విజయవాడలో తొలి కరోనా మృతి నమోదు కాగా.. శనివారం ఉదయం హిందూపూర్‌కు చెందిన కరోనా బాధితుడు మృతి చెందారు.
ఏపీలో రోజు రోజుకు కోవిడ్ 19 కేసులు (COVID-19 Cases In India) పెరిగిపోతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS jagan) మీడియా ముందుకు వచ్చారు. విపత్కర పరిస్థితిలో సీఎం జగన్ ఏపీ ప్రజలకు వీడియో సందేశాన్ని (CM Jagan Video Message) ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో తొలి కోవిడ్-19 మరణం నమోదు
వీడియోలో ఆయన మాట్లాడుతూ.. మర్కజ్ ఘటనకు (Delhi Nizamuddin Markaz) మతం ముద్ర వేయడం సరికాదని, కరోనా కాటుకు (Coronavirus) కుల, మత భేదాలు లేవని సీఎం జగన్ చెప్పారు. కరోనా సృష్టిస్తున్న ఈ సందర్భంగా ఆయన కరోనా కట్టడికి పలు సూచనలు చేశారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని చెప్పారు.